ఫోన్‌లో పాఠాలు

28 Nov, 2019 03:26 IST|Sakshi
సిద్దిపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులతో మాట్లాడుతున్న విద్యాశాఖ పిన్సిపల్‌ సెక్రటరీ జనార్థన్‌రెడ్డి

ఫోన్‌ ద్వారా విద్యార్థులకు ప్రత్యేక బోధన

మహారాష్ట్ర తర్వాత మన రాష్ట్రంలోనే.. 

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): చదువులో వెనకబడిన విద్యార్థులకు త్వరలోనే ఫోన్‌ ద్వారా ప్రత్యేక బోధన అందించనున్నారు. ఇప్పటివరకు ప్రత్యేక శిక్షకుల ఆధ్వర్యంలో మాత్రమే ట్యూషన్లు చెప్పేవారు. కానీ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా టెలీ టీచర్స్‌ ఆధ్వర్యంలో ఫోన్‌ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక బోధన అందించనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పేద, మధ్య తరగతి, గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యనభ్యసిస్తుంటారు. దీంతో వారు తరగతి గదుల్లో మాత్రమే విద్య నేర్చుకున్నారు. వసతి గృహాల్లో ట్యూటర్‌ ఉండటంతో అక్కడి విద్యార్థుల సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోగలుగుతారు. 

కానీ అనేక మంది విద్యార్థులు బిడియం, మొహమాటం కారణంగా తరగతి గదుల్లో తమ సందేహాలను ఉపాధ్యాయులు, ట్యూటర్‌లను అడగలేకపోతున్నారు. సందేహాలు అడిగితే ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఏమనుకుంటారోనన్న ఆలోచనతో అనేకమంది విద్యార్థులు తమ సందేహాలను అడగకుండా చదువులో వెనుకబడి పోతున్నారు. అయితే టెలీ టీచర్స్‌ ద్వారా తమకు వచ్చిన సందేహాలను ఫోన్‌ ద్వారా అడగొచ్చు కాబట్టి విద్యార్థులకు భయం ఉండదనే ఆలోచనతో రాష్ట్ర విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. రిటైర్డ్‌ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు ఖాళీ సమయాల్లో బోధించే ఆసక్తి ఉన్నవారి ద్వారా ఈ టెలీ ట్యూషన్లు నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. టెలీ టీచర్స్‌ పద్ధతి ప్రస్తుతం మహరాçష్ట్రలో అమల్లో ఉంది. 

ప్రత్యేక సమయం.. 
ఈ టెలీ ట్యూషన్‌కు సాయంత్రం ప్రత్యేకంగా సమయం కేటాయించడం ద్వారా అటు ట్యూటర్‌ (టెలీటీచర్స్‌)కు, ఇటు విద్యార్థులకు లాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. దీంతో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పాఠశాల విద్యార్థులకు సబ్జెక్ట్‌లకు సంబంధించిన టెలీ ట్యూటర్‌ ఫోన్‌ నంబర్‌ను ఇవ్వడం ద్వారా విద్యార్థులు వారికి కేటాయించిన సమయంలో ఫోన్‌ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకునే వీలు కలుగుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. టెలీటీచర్స్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు అధికంగా లబ్ధి చేకూరుతుంది. 

ఉత్తమ ఫలితాలు సాధించేందుకు దోహదం 
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు త్వరలోనే టెలీ ట్యూషన్‌ అందుబాటులోకి తెస్తాం. ఇందుకోసం కసరత్తు చేస్తున్నాం. భయపడే, మొహమాటపడే విద్యార్థులు పరోక్షంగా తమ పాఠ్యాంశంలోని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వెనుకబడిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంది. – విద్యా శాఖ పిన్సిపల్‌ సెక్రటరీ జనార్దన్‌రెడ్డి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేటి ముఖ్యాంశాలు..

ఆదివారాలూ ఆధార్‌ సేవలు

మేం రాజీనామా చేస్తాం.. ఆర్టీసీని అలాగే ఉంచండి

వెంటాడిన మృత్యువు

...మేధో మార్గదర్శకం

ఎయిమ్స్‌ పరీక్షలో దుబ్బాక డాక్టర్‌కు ఫస్ట్‌ ర్యాంక్‌

ఉల్లి మరో 3 వారాలు కొరతే!

కేబినెట్‌ భేటీలో ఆర్టీసీపై కీలక నిర్ణయం...

పరిశ్రమల స్థాపనకు రాయితీలు

రెండో రోజూ అదే సీన్‌

వైద్యుల గైర్హాజరుపై మంత్రి ఈటల ఆగ్రహం

నేనే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా

తెలంగాణ ప్రభుత్వం తన వాటా ఇవ్వకనే.. 

‘ఫాస్ట్‌’గానే ప్రజల్లోకి..

జబ్బుల మాటున ఇన్ఫెక్షన్లు!

కొత్తగా ఎనిమిది ‘ఏకలవ్య’ స్కూళ్లు

సీఓఈ కాలేజీల్లో అడ్మిషన్లు షురూ

మిలీనియల్సే టాప్‌

ఉప రాష్ట్రపతిని కలసిన మంత్రి కేటీఆర్‌

ఈనాటి ముఖ్యాంశాలు

చిరుత అనుకొని.. పరుగులు పెట్టిన ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది

నిర్మలా సీతారామన్‌ను కలిసిన లక్ష్మణ్‌

ఆర్టీసీ సమ్మె: కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలు

మరో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

కేయూలో ఉద్రిక్తత; విద్యార్థులపై లాఠీచార్జి

ఆమె-ఆయన.. మధ్యలో ఇంకో ఆయన!

టోల్‌గేట్ల దగ్గర బారులు తీరే పనిలేదు

పేద ప్రజలకు అందని ద్రాక్ష

సంపూర్ణేష్‌ బాబు కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఏడ ఉన్నావే...

నన్ను స్టార్‌ అనొద్దు!

ప్రేమ.. పిచ్చి అలానే ఉన్నాయి!

తిట్టించుకోకపోతే నాకు నిద్ర పట్టదు!

మ్యాన్‌.. మ్యాడ్‌.. మనీ

రజనీ 169 ఫిక్స్‌?