ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌

20 Apr, 2019 16:52 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణాలో ఎన్నికల హడావిడి మళ్లీ మొదలైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి శనివారం విడుదల చేశారు. హైదరాబాద్‌లో నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికలను 3 దశల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణాలో మొత్తం 5,857 ఎంపీటీసీ స్థానాలు, 539 జెడ్పీస్థానాలు ఉన్నాయన్నారు. 47 ఎంపీటీసీ స్థానాలతో పాటు, మంగపేట జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక నిర్వహించడం లేదని వెల్లడించారు. నేటి నుంచి కోడ్‌ అమలులోకి రానుందని చెప్పారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్‌ వేసే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలో జరుగుతాయని చెప్పారు. తెలుపు రంగులో ఎంపీటీసీల బ్యాలెట్‌ పేపర్‌, గులాబీ రుంగులో జెడ్పీటీసీల బ్యాలెట్‌ పేపర్లు ఉంటాయని తెలిపారు.ఎంపీటీసీలకు రూ 1.5 లక్షలు, జెడ్పీటీసీలకు రూ.4 లక్షల గరిష్ట వ్యవపరిమితిగా నిర్ధారించినట్లు వెల్లడించారు. మొత్తం 32 వేల 7 పోలింగ్‌ బూత్‌లలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. మొత్తం ఒక కోటి 56 లక్షల 11 వేల 320 మంది ఓటర్లు ఓటు హక్కును ఈ ఎన్నికల్లో వినియోగించుకోనున్నారని అన్నారు. మొదటి విడతలో 197 జెడ్పీటీసీలు, 2166 ఎంపీటీసీ స్థానాలకు, రెండో విడతలో 180 జెడ్పీటీసీలు, 1913 ఎంపీటీసీ స్థానాలకు, మూడో విడతలో 161 జెడ్పీటీసీలు, 1738 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని, ఈ ఎన్నికల పోలింగ్‌ నిర్వహణకు లక్షా 47 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని,  అలాగే ఎన్నికల ఫలితాలను మే 27న వెల్లడిస్తామని చెప్పారు.

తొలి దశలో(197 జెడ్పీటీసీలు..2166 ఎంపీటీసీలు స్ధానాలు)

నామినేషన్‌: ఏప్రిల్‌ 22 నుంచి ఏప్రిల్‌ 24 వరకు
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్‌ 25న
ఫిర్యాదులు: ఏప్రిల్‌ 27
నామినేషన్‌ ఉపసంహరణ: ఏప్రిల్‌ 28 వరకు
పోలింగ్‌: మే 6న

రెండో దశ(180 జెడ్పీటీసీలు..1913 ఎంపీటీసీలు స్ధానాలు)

నామినేషన్‌: ఏప్రిల్‌ 26 నుంచి ఏప్రిల్‌ 28 వరకు
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్‌ 29న
ఫిర్యాదులు: మే 1న
నామినేషన్‌ ఉపసంహరణ: మే 2 వరకు
పోలింగ్‌: మే 10న

మూడో దశ(161 జెడ్పీటీసీలు..1738 ఎంపీటీసీలు స్ధానాలు)

నామినేషన్‌: ఏప్రిల్‌ 30 నుంచి మే 2 వరకు
నామినేషన్ల పరిశీలన: మే 3న
ఫిర్యాదులు:  మే 5న
నామినేషన్‌ ఉపసంహరణ: మే6 వరకు
పోలింగ్‌: మే 14

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అజ్ఞాతం నుంచి రవిప్రకాశ్‌ వీడియో సందేశం!

‘నిమ్మ’ ధర..ఢమాల్‌! 

తొలి ఫలితం.. హైదరాబాద్‌దే!

అంతా రెడీ!

కూల్చి‘వెత’లెన్నో!

భవిష్యత్తుకు భరోసా

ఎవరి ధీమా వారిదే! 

నిప్పుల కుంపటి 

ప్రాణం పోసిన ‘సోషల్‌ మీడియా’

సినీ నిర్మాత అల్లు అరవింద్‌ ఔదార్యం

చేవెళ్ల లోక్‌సభ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

‘కార్పొరేట్‌’ గాలం!

‘మిస్సెస్‌ యూనివర్స్‌’ ఫైనల్‌కు సిటీ వనిత

కాలేజీలో మొదలై ఆకాష్‌ అంబానీ పెళ్లి వరకు అతడే..

‘ప్రాంతీయ పార్టీలను భయపెట్టేందుకే..’

అవతరణ వేడుక ఏర్పాట్ల పరిశీలన

చంద్రబాబుది బిల్డప్‌: పొంగులేటి

2న అమరుల ఆకాంక్షల దినం

‘వాస్తవాలకతీతంగా ఎగ్జిట్‌ ఫలితాలు’

23, 24 తేదీల్లో విజయోత్సవాలు

సంస్కరణలకు ఆద్యుడు రాజీవ్‌

మళ్లింపు జలాలపై కేంద్రం హ్యాండ్సప్‌!

డీజిలే అసలు విలన్‌...

పార్ట్‌–బీ భూములకు మోక్షమెప్పుడో?

‘సింగరేణియన్స్‌ హౌస్‌’ నిధుల దుర్వినియోగం

కాంగ్రెస్‌ పార్టీలో కోవర్టులు

రైతులను ముంచడమే లక్ష్యంగా..

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి 

జూన్‌ 8, 9 తేదీల్లో చేపమందు 

‘రూపాయికే అంత్యక్రియలు’ భేష్‌ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రభుదేవా, తమన్నా రేర్‌ రికార్డ్‌!

విజయ్‌ దేవరకొండ ‘బ్రేకప్‌’!

‘పిల్లలు కావాలి కానీ తల్లి వద్దు’

‘దొరసాని’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

సినిమానే పెళ్లి చేసుకున్నాడు..

ఎలా డేటింగ్‌ చేయాలో తెలియదు