మిర్యాలగూడ చుట్టూ కాంగ్రెస్‌ రాజకీయం

12 Sep, 2018 10:05 IST|Sakshi
జానారెడ్డి

సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లా కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది..?  రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ ఇంత వరకు ఒక్క టికెట్టూ ప్రకటించకున్నా, ఎక్కడి సిట్టింగులు అక్కడే పోటీ చేస్తారన్న సాధారణ అభిప్రాయం ఉంది. అదే సమయంలో రాష్ట్రస్థాయిలో వివిధ పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తుల చర్చలు జరుపుతుండడంతో ఆ పార్టీ నాయకులు ఏ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారో అన్న అంశం చర్చనీయాంశమైంది. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌లో ముఖ్య నేతలంతా ఉమ్మడి నల్లగొండ జిల్లానుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో సహజంగానే ఇక్కడి కూర్పుపై ఆసక్తి నెలకొంది. ముందస్తు ఎన్నికల కోసం టీఆర్‌ఎస్‌ చాలా ముందుగానే టికెట్లు ఖరారు చేయడంతో వారిపై ఎవరు పోటీ చేస్తారన్న అంశం చర్చలకు తావిస్తోంది.

ప్రధానంగా సీఎల్పీ మాజీ నేత జానా రెడ్డి పోటీ విషయం గడిచిన రెండు మూడు రోజులుగా రాజకీయ వర్గాల్లో బాగా చర్చల్లో ఉంది. ఆయన నాగా ర్జునసాగర్‌ నుంచి మిర్యాలగూడకు మారుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. జానా రాజకీయ జీవి తంలో ఒకసారి మినహా అప్రతిహతంగా గెలుస్తూ వస్తు న్న నాగార్జున సాగర్‌ను వదిలి మిర్యాలగూడ ఎందుకు రావాలనుకుంటున్నారో అంచనా కూడా వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడినుంచి    
కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించిన ఎన్‌.భాస్కర్‌రావు ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ గూటికి చే రారు. ఆయన టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మం గళవారం బైక్‌ర్యాలీతో ప్రచారం మొదలు పెట్టారు. 
మిర్యాలగూడ.. ఎందుకు ?
ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్‌ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆశల్లో ఉన్న కాంగ్రెస్‌ నాయకులు సురక్షితమైన స్థానాలు వెదుక్కుంటున్నారని చెబు తున్నారు. ప్రధానంగా సీఎం రేసులో జానారెడ్డి ఉ న్నారని అంటున్న ఆ పార్టీ నాయకులు, ఎలాం టి ఇబ్బందీ లేకుండా గెలవగలిగే స్థానంపై దృష్టి పె ట్టారని, తమ పట్టు ఎక్కువగా ఉందని భావిస్తున్న స్థానాల్లో గెలుపు తేలికవుతుందన్న అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు. అంతే కాకుండా, గత ఎన్నికల్లో భాస్కర్‌ రావును గెలిపించింది తామేన ని, జానారెడ్డికి ఈ నియోజకవర్గంపై ఉన్న పట్టుతోనే భాస్కర్‌ రావు గెలిచారని విశ్లేషిస్తున్నారు.

మొన్నటి ఎన్నికల్లో పోటీచేసే వరకు ప్రత్యక్ష రాజ కీయాలతో పెద్దగా సబంధం లేని భాస్కర్‌రావు జానారెడ్డికి చేదోడు వాదోడుగా మాత్రమే ఉన్నార ని, ఆయన పనిమొత్తం తెరవెనుకే చేసేవారు కాబ ట్టి ఆయనకున్న పరిచయాలు, స్నేహాలు కూడా జానారెడ్డికి సబంధించినవేనని విశ్లేషిస్తున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. టీఆర్‌ఎస్‌ అభ్యర్తిగా ఉన్న భాస్కర్‌రావుపై మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్‌ తేలిగ్గా గెలుస్తుందని అంచనా కు వచ్చిన పార్టీ నాయకులు, జానారెడ్డి ఇక్కడినుంచి పోటీ చేస్తారని విశ్లేషించి చెబుతున్నారు. ఒకవేళ జానారెడ్డి మిర్యాలగూడ నుంచి పోటీ చే యడం ఖాయమైతే టీఆర్‌ఎస్‌ కూడా పునరాలో చన చేసే అవకాశం లేకపోలేదని, మరో బలమైన అభ్యర్థిని వెదికే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తూ అందుకు తగినట్టుగానే కాంగ్రెస్‌ తమ ప్ర ణాళికను సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. ఈ కారణంగానే తానే స్వయంగా బరిలోకి దిగితే విజ యం మరింత తేలికవువుతుందన్న అభిప్రాయంతోనే ఇక్కడి మారాలనుకుంటున్నారని పేర్కొం టున్నారు.

మరి.. సాగర్‌?
సుదీర్ఘకాలంగా నాగార్జున సాగర్‌ నుంచి ప్రాతినిధ్యం వహించిన జానారెడ్డి అక్కడ పోటీనుంచి తప్పుకుంటే  ఇక్కడినుంచి మరెవరు పోటీ చేస్తారు? ఈ ప్రశ్నకూ కాంగ్రెస్‌ నేతల దగ్గర రెడీమేడ్‌ సమాధానం ఉంది. జానారెడ్డి తనయుడు రఘువీర్‌ రెడ్డి ఇక్కడి నుంచి పోటీలో ఉంటారని చెబుతున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులకు టికెట్లు ఇస్తారా అంటే.. ఇప్పటికే నిర్ణయం జరిగిందని, రంగారెడ్డి జిల్లాలో కూడా ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్లు ఇవ్వనున్నారని పార్టీ నాయకత్వం చెబుతోంది. ముందునుంచీ జరుగుతున్న ప్రచారం మేరకైతే.. జానారెడ్డి నాగార్జునసాగర్‌ నుంచి ఆయన తనయుడు రఘువీర్‌ రెడ్డి మిర్యాలగూడ నుంచి పోటీ చేయాల్సి ఉంది. కానీ, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తండ్రీ కొడుకులు బరిలోకి దిగడం ఖాయమని, కాకుంటే స్థానాలు అటు ఇటవుతాయని పార్టీ వర్గాల సమాచారం.

సాగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఖరారైన నోముల నర్సింహయ్య స్థానికేతరుడని, తమలో ఎవరికో ఒకరికి టికెట్‌ ఇవ్వాలని ఇప్పటికే ఆ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక్కడ పార్టీలో అసమ్మతి తారస్థాయికి చేరుకుంది. ఎంసీ కోటిరెడ్డి, తేరా చిన్నపరెడ్డి తదితర నేతలు అసమ్మతి సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు.  టీఆర్‌ఎస్‌లో కనిపిస్తున్న ఈ అభిప్రాయ బేధాలు, అసమ్మతి తొలిసారి పోటీచేసే ఎవరికైనా లాభిస్తుందని, ఆ లెక్కన రఘువీర్‌రెడ్డి తేలిగ్గా బయట పడతారన్నది కాంగ్రెస్‌ నేతల అంచనా. మిర్యాలగూడలోనూపార్టీ సీనియర్‌నాయకుడు అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి వర్గం  భాస్కర్‌రావుకు టికెట్‌ ఇవ్వడాన్ని వ్య తిరేకించడంతోపాటు ఆయనకు సహకరించే అవకాశాల్లేవంటున్నారు. ఇది తమకెంతో ఉపయోగడుతుందని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

మరిన్ని వార్తలు