'సీఎం ఆదేశించినా పనుల్లో జాప్యం'

27 Jun, 2015 14:54 IST|Sakshi
'సీఎం ఆదేశించినా పనుల్లో జాప్యం'

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్, సీఎస్ రాజీవ్ శర్మ ఆదేశించినా హెల్త్కార్డుల విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని, జాప్యం జరుగుతుందని ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి రాష్ట్ర ఉద్యోగ సంఘాలు నేతలు తెలిపారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు, పలువురు అధికారులతో శనివారం మధ్యాహ్నం లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు.

హెల్త్కార్డులు, నగదు రహిత వైద్యంపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఉచిత ఓపీ సౌకర్యాన్నికల్పించాలని ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి లక్ష్మారెడ్డికి విన్నవించారు.

మరిన్ని వార్తలు