తాజా - మాజీల అలయ్.. బలయ్!

2 Mar, 2015 04:03 IST|Sakshi
తాజా - మాజీల అలయ్.. బలయ్!

వరంగల్: ప్రస్తుత డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఇలా అలయ్.. బలయ్ ఇచ్చుకున్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల శాసనమండలి ఎన్నికల సందర్భంగా హన్మకొండలో ఆదివారం నిర్వహించిన సభలో ఈ దృశ్యం చోటుచేసుకుంది. గతం నుంచే అంటీముట్టనట్లుగా ఉండే రాజయ్య, శ్రీహరిల మధ్య.. ఇటీవలి పరిణామాలతో ఇంకాస్త దూరం పెరిగింది.

పదవీచ్యుతుడైన తర్వాత డాక్టర్ రాజయ్య తన నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు కార్యక్రమాల్లో పరోక్షంగా హెచ్చరికలు సైతం చేశారు. ‘నా నియోజకవర్గంలో వేలుపెడితే సహించేది లేదు.. రుద్రశక్తినవుతా’ అని ఘాటుగా ప్రసంగించారు. ఈ క్రమంలో ఇద్దరూ షేక్‌హ్యాండ్‌తోపాటు అలయ్.. బలయ్ ఇచ్చుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.      

 

మరిన్ని వార్తలు