మంత్రిగా రామన్న బాధ్యతల స్వీకరణ

12 Jun, 2014 04:46 IST|Sakshi
మంత్రిగా రామన్న బాధ్యతల స్వీకరణ

ఆదిలాబాద్ : తెలంగాణ తొలి రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా జోగు రామన్న బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో బుధవారం 4.15 గంటల ప్రాంతంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. వేద పండితుల సమక్షంలో మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరిస్తూ తొలి ఫైల్‌పై సంతకం చేశారు. జిల్లా ఎమ్మెల్యేలు ఐకే రెడ్డి, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, దివాకర్‌రావు, కోవ లక్ష్మి, రాథోడ్ బాపురావు, రేఖా శ్యాంనాయక్, టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, టీఆర్‌ఎస్ నేత బాలూరి గోవర్ధన్‌రెడ్డి, నాయకులు గోక మహేందర్‌రెడ్డి, తదితరులు మంత్రికి అభినందనలు తెలిపారు. వారితోపాటు టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిందర్‌రెడ్డితో కలిసి జిల్లా టీఎన్‌జీవో అధ్యక్షుడు ఎస్.అశోక్, తాలుకా అధ్యక్షుడు నవీన్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ప్రభాకర్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు డి.కిష్టు, తదితరులు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు