‘చిరుత’ వీడియో ఆకతాయిల పనే!

22 Apr, 2020 10:49 IST|Sakshi
కేబీఆర్‌ పార్కు వద్ద విచారణ చేస్తున్న అటవీశాఖాధికారులు

జూబ్లీహిల్స్‌: సోషల్‌ మీడియాలో బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ ఆస్పత్రి నుంచి అపోలో ఆస్పత్రి వైపు కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు వైరల్‌ అయిన వీడియో అవాస్తవం అని అధికారులు తేల్చేశారు. మంగళవారం తెలంగాణ యాంటీ పోచింగ్‌ స్క్వాడ్‌ బృందం కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో విచారణ జరిపి ఈ వీడియో ఆకతాయిలు చేసిన పని అని ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ రమేష్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ వీడియో తిరుమల కొండల్లోని సీసీ ఫుటేజీ వీడియో అని అనవసరంగా ఇక్కడి వీడియో అని కొంత మంది ప్రచారం చేశారని, సోషల్‌ మీడియాలో వచ్చే ఇలాంటి వైరల్‌ వార్తలను నమ్మవద్దని ఆయన సూచించారు. కార్యక్రమంలో అటవీ శాఖాధికారులు కౌసర్‌ అలీ, యాసిన్, మహేష్, సతీష్, శ్రీను పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు