నేటి నుంచి తెలంగాణ వైఎస్సార్‌సీపీ సమీక్షలు

16 Oct, 2014 00:33 IST|Sakshi
నేటి నుంచి తెలంగాణ వైఎస్సార్‌సీపీ సమీక్షలు

హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ తెలంగాణ పదిజిల్లాల పార్టీ సమీక్ష సమావేశాలు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనున్నాయి. పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఈ నెల 16వ తేదీ గురువారం నుంచి 21వ తేదీ వరకు జరిగే పార్టీ జిల్లాస్థాయి సమీక్షల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొంటారు.

జిల్లాలవారీగా సమీక్షల వివరాలు... 16న ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా, మధ్యాహ్నం వరంగల్ జిల్లా, 17న ఉదయం ఆదిలాబాద్ జిల్లా, మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లా, 18న ఉదయం నల్లగొండ జిల్లా, మధ్యాహ్నం క రీంనగర్ జిల్లా, 19న హైదరాబాద్, 20న ఉదయం రంగారెడ్డి అర్బన్, మధ్యాహ్నం రంగారెడ్డి రూరల్, 21న ఉదయం మెదక్ జిల్లా, మధ్యాహ్నం ఖమ్మం జిల్లా పార్టీ సమీక్షలు ఉంటాయని పార్టీవర్గాలు తెలిపాయి.
 
 
 

మరిన్ని వార్తలు