గొర్రెల పెంపకంలో మనదే అగ్రస్థానం

31 May, 2020 02:30 IST|Sakshi

పశుసంవర్థ్ధక శాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల జరిపిన 20వ పశుగణన– 2019 ప్రకారం గొర్రెల పెంపకంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర పశుసంవర్థ్ధక శాఖ వెల్లడించింది. ఈ గణన ప్రకారం రాష్ట్రంలో మొత్తం జీవాల సంఖ్య 2.40 కోట్లు కాగా, అందులో 1.91 కోట్లు గొర్రెలు కాగా, మేకలు 49.48 లక్షలని పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ వి.లక్ష్మారెడ్డి శని వారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన గొర్రెల అభివృద్ధి పథకంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3.66 లక్షల మంది లబ్ధిదారులకు రూ.4,579.67 కోట్ల వ్యయంతో పొరుగు రాష్ట్రాల నుంచి 76.94 లక్షల గొర్రెలను కొనుగోలు చేసి పంపిణీ చేశామన్నారు. పంపిణీ చేసిన గొర్రెల ద్వారా 108.37 లక్షల పిల్లలు పుట్టాయని, వీటి ద్వారా గ్రామాల్లో రూ.4,877.01 కోట్ల విలువైన సంపద సృష్టిం చ బడిందని, వీటిద్వారా 75,865.82 మెట్రిక్‌ టన్నుల మాంస ఉత్పత్తి అంచనా వేస్తున్నట్టు తెలిపారు.

గతం కంటే 48.52% పెరిగిన వృద్ధి 
2012లో జరిగిన 19వ జాతీయ గణనలో రాష్ట్రంలోని గొర్రెల సంఖ్య 128.35 లక్షలు కా గా, ఇప్పుడు 190లక్షలని, అంటే గతం కన్నా 48.52% గొర్రెలు పెరిగాయని తెలిపారు. కేంద్రం లెక్కల ప్రకారం రాష్ట్రంలో వధించబడే గొర్రెల సంఖ్య పెరిగిందని తెలిపారు. గొర్రెల అభివృద్ధి పథకం అమలు తర్వాత రాష్ట్రంలో మాంసం ఉత్పత్తిలో గణనీయమైన మార్పు వచ్చిందని, 2015–16లో గొర్రె మాంస ఉత్ప త్తి 1.35 లక్షల  టన్నులుంటే 2019– 20లో 2.77 లక్షల టన్నులకు పెరిగిందన్నారు.

మరిన్ని వార్తలు