2020 సెలవులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

22 Nov, 2019 02:41 IST|Sakshi

సాధారణ సెలవులు-23, ఐచ్ఛిక సెలవులు-17

సాక్షి, హైదరాబాద్‌: 2020కి సంబంధించిన సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 28 సాధారణ సెలవుల్లో 5 సెలవులు ఆదివారం/రెండో శనివారం వస్తున్నాయి. ప్రధాన పండుగలైన దసరా (విజయదశమి), మొహర్రం, గణతంత్ర దినోత్సవం, బాబూ జగ్జీవన్‌రాం జయంతి ఆదివారం రానుండటంతోపాటు దీపావళి రెండో శనివారం రానుంది. మిగిలిన 23 సాధారణ సెలవుల్లో 6 సెలవులు శనివారాల్లో వస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగులకు మరుసటిరోజు ఆదివారం సెలవు రోజు కలసి రానుంది.

అదే విధంగా మరో 5 సాధారణ సెలవులు శుక్రవారం వస్తున్నాయి. మరో 4 సాధారణ సెలవులు సోమవా రం వస్తుండటంతో అంతకుముందు రోజు ఆదివారం సెలవు కలసి రానుంది. జనవరి 1న కొత్త ఏడాది సందర్భంగా సెలవు ప్రకటించినందున ఫిబ్రవరి 8న రెండో శనివారం వర్కింగ్‌ డేగా ప్రభుత్వం వెల్లడించింది. తమ మత విశ్వాసాలతో సంబంధం లేకుండా ఐచ్ఛిక సెలవుల్లో ఏవైనా 5 సెలవులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకోవచ్చని పేర్కొంది.
నోట్‌: 1) మార్చి 9న హజ్రత్‌ అలీ జయంతి నేపథ్యంలో ఇవ్వాల్సిన ఐచ్ఛిక సెలవును అదేరోజు హోళి రావడంతో సాధారణ సెలవుగా ప్రకటించారు.  
 2) అక్టోబర్‌ 24న మహర్నవమి నేపథ్యంలో ఇవ్వాల్సిన ఐచ్ఛిక సెలవును దుర్గాష్టమి అదేరోజు రావడంతో సాధారణ సెలవుగా ప్రకటించారు.  
 3) నవంబర్‌ 14న నరక చతుర్థి సందర్భంగా ఇవ్వాల్సిన ఐచ్ఛిక సెలవును దీపావళి అదేరోజు రావడంతో సాధారణ సెలవుగా ప్రకటించారు.   


మరిన్ని వార్తలు