కొత్తగా వంద ‘108’ అంబులెన్సులు

23 Jul, 2020 04:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుం డటం, అనేక కేసులు సీరియస్‌గా మారుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ‘108’అత్యవసర అంబులెన్స్‌ సేవలను మరింత విస్తరించింది. కొత్తగా మరో వంద వాహనాలను కొనుగోలు చేసింది. అవి నేడో రేపో రాష్ట్రానికి చేరుకోనున్నాయి. ప్రస్తుతము న్న వాహనాల్లో 90 అంబులెన్సులు కరోనా బాధితుల నిమిత్తం వినియోగిస్తుండగా మిగిలిన వాటిని ఇతర అత్యవసర సేవలకు వాడుతున్నారు. దీంతో అంబులెన్సుల కొరత ఏర్పడి కొన్నిచోట్ల సాధారణమైన వాహనాలను కూడా వినియోగిస్తున్నారు. వా టిల్లో ఎలాంటి ఆక్సిజన్‌ సదుపాయాలు కూడా ఉం డటంలేదు. ఈ నేపథ్యంలో ఆగమేఘాల మీద టెం డర్లు పిలిచి వంద కొత్త ‘108’అంబులెన్స్‌ వాహనా లు కొనుగోలు చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.  

క్రిటికల్‌ కేర్‌ ఏర్పాట్లు 
కొత్తగా వచ్చే వంద ‘108’అంబులెన్సుల్లో ఆక్సిజన్‌ సదుపాయం ఉంటుంది. కరోనా కేసులు సీరియస్‌ అయినప్పుడు అవసరమైన అత్యాధునిక వసతుల తో వీటిని తయారు చేయించినట్లు వైద్య, ఆరోగ్యశా ఖ వర్గాలు తెలిపాయి. అన్ని రకాల క్రిటికల్‌ కేర్‌ ఉండేలా వీటిని తీర్చిదిద్దారు. కేసులు అత్యధికంగా నమోదవుతున్న హైదరాబాద్‌ సహా ఇతర జిల్లాలు, ప్రాంతాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా, ఈ కొత్త అంబులెన్సులకు అవసరమైన డ్రైవర్లను, ఇతర పారామెడికల్‌ సిబ్బందిని నియమించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.   

మరిన్ని వార్తలు