ఏడు రోజులు సంతాప దినాలు 

17 Aug, 2018 05:27 IST|Sakshi
మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి

సాక్షి, హైదరాబాద్‌ : మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతికి సంతాపంగా తెలంగాణ ప్రభుత్వం శుక్రవారాన్ని సెలవు దినంగా ప్రకటించింది. రాష్ట్ర పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ అధీనంలో పనిచేస్తోన్న సంస్థలు, కార్పొరేషన్లు, బోర్డులు తదితరాలు నేడు పనిచేయవని తెలంగాణ సీఎంవో కార్యాలయం ట్వీట్‌ ద్వారా వెల్లడించింది.  

ఏడు రోజులు సంతాప దినాలు 
మాజీ ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 7 రోజులపాటు సంతాప దినాలను ప్రకటించింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.  

మరిన్ని వార్తలు