హెచ్‌ఎండీఏ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌ లేనట్టే...

21 Oct, 2019 02:24 IST|Sakshi

రాష్ట్రంలో కేవలం 43 మున్సిపాలిటీలకే పరిమితం చేసిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అవకాశమిచ్చిన లేఔట్‌ రెగ్యులేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) లో హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపాలిటీ కార్పొరేషన్ల లోని అనధికారి లేఅవుట్‌ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం లేదు. ప్రభుత్వం తొలుత హెచ్‌ఎండీఏ పరిధిలోని 30 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా 73 సంస్థల పరిధిలో అవకాశమివ్వాలని భావించినా ఆ తర్వాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

2018 మార్చి 30 కటాఫ్‌గా నిర్ణయించడంతో లక్షకుపైగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు వచ్చి కోట్లలో ఆదాయం వస్తుందని లెక్కలు వేస్తున్నారు.90 రోజుల్లోపు అంటే 3 నెలల్లోపు ఆయా ప్లాట్ల యజమానులు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు. ప్రారంభ ఫీజుగా రూ.పదివేలు చెల్లించి దరఖాస్తు చేసిన తర్వాత ఆయా డాక్యుమెంట్లు సరిగా ఉంటే సబ్‌రిజిష్టార్‌ మార్కెట్‌ వ్యాల్యూ ఆధారంగా ఎల్‌ఆర్‌ఎస్,వ్యవసాయేతర(నాలా) ఫీజును అధికారులు లబ్ధిదారుని సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో పంపిస్తారు.అయితే గతంలో లాగే ఈ దరఖాస్తులను డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ) పరిశీలించనుంది.

అవకాశం వీటికే: నర్సాపూర్‌ మునిసిపాలిటీ, చెన్నూర్, క్యాతనపల్లి, లక్సెట్టిపేట, ఖానాపూర్, చొప్పదండి, కొత్తపల్లి, రాయికల్, ధర్మపురి, మంథని, సుల్తానాబాద్, వైరా, వర్ధన్నపేట, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, నడికొండ, చిత్యల్, హాలి యా, చందూర్, నేరేడ్‌చెర్ల, తిరుమలగిరి, మోత్కు రు, ఆలేర్, యాదగిరిగుట్ట, మత్కల్, భూత్పూర్, కోస్గి, కొత్తకోట, పెబ్బెర్, ఆత్మకూర్, అమరచింత, వడ్డెపల్లి, అలంపూర్, రామాయంపేట, చేర్యాల, నారాయణ్‌ఖేడ్, బాన్సువాడ, భీంగల్, ఎల్లారెడ్డి, పరిగి, కొడంగల్, ఆమన్‌గల్‌ మునిసిపాలిటీలకు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చారు..

మరిన్ని వార్తలు