మానేరు సజీవం

3 Jan, 2020 00:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోదావరికి ఉపనదిగా ఉన్న మానేరు నదిని ఏడాదంతా పూర్తిగా సజీవం చేసే ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశాలకు అనుగుణంగా మొత్తంగా మానేరు నదిపై 29 చెక్‌డ్యామ్‌ల నిర్మించేలా ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేయగా, వాటికి టెండర్లు పిలిచి, పనులు మొదలు పెట్టే దిశగా అధికారులు కసరత్తులు మొదలు పెట్టారు. మానేరు నది మొత్తం పొడవు 180 కిలోమీటర్లు కాగా, ఇందులో 40 కిలోమీటర్ల మేర ఎప్పుడూ నీటితో ఉంటుంది. ప్రస్తుతం మరో 40 కిలోమీటర్ల మేర నదిలో నీటి నిల్వలు నిత్యం ఉండేలా 29 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయాలని సీఎం సూచించారు. వీటికి సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

వీటితో పాటే మూలవాగుపై మరో 12 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి సీ ఎం గ్రీ¯Œ సిగ్నల్‌ ఇచ్చారు. వీటి ద్వారా 30 కిలోమీటర్ల మేర నీటి నిల్వలు పెరగనున్నా యి. మొత్తం 41 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి రూ.582 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కతేల్చారు. వీటికి పరిపాలనా అనుమతి ఇవ్వాల్సి ఉం ది. పూర్వ కరీంనగర్‌ జిల్లా నేతలతో ఈ చెక్‌డ్యామ్‌ల నిర్మాణంపై ప్రగతిభవ¯Œ లో అతి త్వరలోనే సమీక్ష నిర్వహించి, చర్చించిన అనంతరం వీటికి అనుమతులిచ్చే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. 

మరిన్ని వార్తలు