సిటీ.. చుట్టూ ఐటీ...

19 Sep, 2019 02:03 IST|Sakshi

శంషాబాద్, మహేశ్వరంలోనూ అభివృద్ధికి చర్యలు

జాతీయ స్థాయి సగటు కంటే తెలంగాణ ఐటీ ఎగుమతులే అధికం 

దక్షిణాదిలో రెండోస్థానం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఐటీ అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేది హైటెక్‌ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లాలు మాత్రమే. ఇప్పుడు ఆదిభట్లలోనూ పరిశ్రమలు విస్తరిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితి మారి నగరం చుట్టూ ఐటీ విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఐటీశాఖ చర్యలు తీసుకుంటోంది. శివారు ప్రాంతాలకు సైతం విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీ శాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఇప్పటికే ఆదిభట్లలో టీసీఎస్‌ సహా ఇతర ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయని.. ఇదే స్ఫూర్తితో శంషాబాద్, మహేశ్వరం ప్రాంతాల్లోనూ ఐటీ కంపెనీలు నెలకొల్పేందుకు ముందుకొచ్చే కంపెనీలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపాయి. కాగా, ఐటీ ఎగుమతుల విషయంలో జాతీయ సగటు తొమ్మిది శాతంతో పోలిస్తే తెలంగాణ ఐటీ ఎగుమతులు 17 శాతం అధికంగా ఉన్నాయన్నాయి. నూతన ఐటీ కంపెనీల ఏర్పాటుతో ఉపాధి కల్పనకు ఊతమివ్వడంతోపాటు ఆయా ప్రాంతాల సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపాయి. ఐటీ ఎగుమతుల్లో దక్షిణాదిలో బెంగళూరు తర్వాత రెండోస్థానంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరం నిలిచినట్లు పేర్కొన్నాయి. 

టైర్‌–2 నగరాల్లోనూ ఐటీకి బాటలు.. 
గ్రేటర్‌ శివార్లతోపాటు రాష్ట్రంలోని ఇతర టైర్‌–2 నగరాల్లోనూ ఐటీ టవర్స్‌ను నిర్మించి పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లోనూ ఐటీ టవర్స్‌ను నిర్మించి.. వాటిల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రక్రియ ఈ ఏడాది చివరిలో ప్రారంభమౌతుందన్నారు.  

గ్రేటర్‌లో ఉపాధి ఇలా... 
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన కంపెనీల్లో 50 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించినట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. టీఎస్‌ ఐపాస్‌ రాకతో గత కొన్నేళ్లుగా బుద్వేల్, ఆదిభట్ల తదితర ప్రాంతాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు సుమారు 30 కంపెనీలు దరఖాస్తు చేశాయన్నారు. కాగా గ్రేటర్‌ కేంద్రంగా సుమారు 647 ఐటీ కంపెనీల బ్రాంచీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఆయా కంపెనీల్లో సుమారు 6 లక్షల మంది ఉపాధి పొందుతున్న విషయం విదితమే.  ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఐసీటీ, హార్డ్‌వేర్‌ పాలసీలతోపాటు ఇమేజ్‌ పాలసీ, ఇన్నోవేషన్‌ (స్టార్టప్‌) పాలసీ, డ్రోన్‌ పాలసీ, సైబర్‌ సెక్యూరిటీ పాలసీలు ఐటీ రంగం వృద్ధికి దోహదం చేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా తెలంగాణ ఐటీ ఎగుమతులు గతేడాది రూ.1.09 లక్షల కోట్లమేర ఉన్నాయని తెలిపాయి. 

గత కొన్నేళ్లుగా గ్రేటర్‌ నుంచి ఐటీ ఎగుమతులు ( రూ. కోట్లలో)   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కల్తీ లేని సరుకులు, కూరగాయలు - సీఎం కేసీఆర్‌

31,000 పోస్టులు.. 900 కేసులు- హరీశ్‌రావు

నల్లని మబ్బు చల్లని కబురేనా?

మానవ రవాణా కేసు ఎన్‌ఐఏకు బదిలీ

ఈనాటి ముఖ్యాంశాలు

అలా చేయడం.. పెళ్లి లేకుండా సహజీవనమే

టికెట్‌ వార్‌: ఉత్తమ్‌ వర్సెస్‌ రేవంత్‌

ప్రజల సహకారంతోనే జపాన్‌, సింగపూర్‌ అభివృద్ధి..

ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టినప్పుడే: డీజీపీ

'ప్రభుత్వ జీవోలను వెబ్‌సైట్లలో ఉంచాలి'

కళ్లలో కారం కొట్టి.. మారణాయుధాలతో దాడి

తొలి దశలోనే క్యాన్సర్‌ను గుర్తించే 'జాకెట్‌'

విషాదం : విద్యుత్‌షాక్‌తో దంపతుల మృతి

తమాషా చేస్తున్నారా? - కలెక్టర్‌ ఆగ్రహం

మాకో వైన్స్‌ కావాలి..! 

ఈ సర్కార్‌ నౌకరీ మాకొద్దు! 

భీం ధామం అద్భుతం..!

‘ప్రణయ్‌ పేరుతో నిరభ్యంతర చట్టం’

ఆంక్షలు లేవ్‌, ప్రజావాణికి ఎవరైనా రావొచ్చు

అధికంగా వసూలు చేస్తే సీజ్‌ చేస్తా

'సిటీ' బ్రాండ్‌ ఇమేజ్‌ను కాపాడాలి!

ఫారెస్ట్‌ అధికారుల తీరుపై కలెక్టర్‌ అసహనం

భర్తకు డబ్బు కావాలని భార్యకు ఫోన్‌

చెత్త వేస్తే ఫైన్లు తప్పవు

గోదావరి ఘటనపై అలర్ట్‌ చేసిన సీఎం !

అధికారికంగా విమోచన దినోత్సవం జరపాలి

డ్రిల్‌తో పాటు ఫైరింగ్‌ కూడా ముఖ్యమే..

ఠాణాల్లో రాచ మర్యాదలు!

కనీస సమాచారం లేకపోతే ఎలా..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆస్కార్‌ బరిలో మోతీ భాగ్‌

‘ఇలాంటి సినిమాలకు డబ్బులుంటే సరిపోదు’

ఇప్పుడు విలన్‌గా ఎందుకు అన్నారు : వరుణ్‌

విఘ్నేష్‌కు నయనతార భారీ కానుక

పెళ్లైన విషయం మర్చిపోయిన నటి

‘అతనొక యోగి.. అతనొక యోధుడు’