విపత్తు.. ఇక చిత్తు

22 Nov, 2019 02:59 IST|Sakshi

అందుబాటులోకి డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ వాహనాలు

దేశంలోనే ‘గ్రేటర్‌’లోనే తొలిసారి.. ప్రారంభించిన కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో విపత్తులు సంభవించినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా రూపొందించిన 8 డీఆర్‌ఎఫ్‌ (డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఈవీడీఎం (ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) విభాగం ద్వారా సమకూర్చుకున్న వీటిని గురువారం నెక్లెస్‌ రోడ్‌లోని జీహెచ్‌ఎంసీ పార్కింగ్‌ యార్డులో మంత్రి కేటీఆర్‌ ప్రారంభిం చారు. ఒక్కో వాహనానికి రూ.18 లక్షలు వ్యయం కాగా, ఒక్కో జనరేటర్‌కు రూ.3.5 లక్షలు, ఇతర సామగ్రికి రూ.20 లక్షల చొప్పున వెచ్చించారు. విపత్తులను ఎదుర్కోవడంతో పాటు అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ఈ వాహనాలను వినియోగిస్తారు. దేశంలోనే ఇలాంటి వాహనాలను తొలిసారిగా జీహెచ్‌ఎంసీ సమకూర్చుకుందని అధికారులు చెప్పారు.  

మరిన్ని వార్తలు