పరిశీలనలో ఉచిత రేషన్ బియ్యం : ఈటెల

25 Sep, 2014 01:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: అర్హులైన పేదలకు కిలో బియ్యం రూపాయికి ఇవ్వాలా..? రూ. రెండుకు ఇవ్వాలా లేక ఉచితం గానా..? అనే అంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం సమీక్షిస్తోందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ప్రస్తుతం ఒక్కో కుటుంబానికి ఇస్తున్న బియ్యం పరిమితిని 20 కేజీల నుంచి 35 కేజీలకు పెంచే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఈటెల చెప్పారు. ఈ అంశంపై మంత్రి వర్గ ఉప సంఘం సమీక్షల అనంతరం నివేదకను రూపొందించి సీఎంకు అందజేస్తామని... సీఎం సూచనల మేరకు మెరుగైన పద్ధతులను అవలంబిస్తామని ఈటెల తెలిపారు.

మరిన్ని వార్తలు