‘ఇక ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు’

9 Jun, 2018 14:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అభివృద్దిలో మరో మైలు రాయి నమోదైంది. సామాన్యులకు, పేదలకు వైద్య పరీక్షలు భారం కాకూడదనే ఉద్దేశంతో ఉచితంగా వ్యాధి నిర్దారణ పరీక్షలను ప్రభుత్వమే నిర్వహించాలని భావించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా శనివారం నారాయణగూడలోని ఐపీఎం ఆవరణలో ఉచిత డయాగ్నోస్టిక్స్‌ సెంటర్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిలు కలిసి ప్రారంభించారు. 

అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 40 ఉచిత డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కేసీఆర్‌ కిట్‌ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగిందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.  హైదరాబాద్‌లోని పేద వారికి ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రతి పదివేల మందికి ఒక బస్తీ దవాఖానా ఏర్పాటు చేసామని మంత్రి వివరించారు. అందులో భాగంగా నగరంలో 17 బస్తీ దవాఖానాలు ప్రారంభించామని మంత్రి పేర్కొన్నారు. 

మానవీయ కోణంలో వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తుందని,  ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేసామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆరోగ్య శాఖలో సిబ్బందిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.   

మరిన్ని వార్తలు