సీఎస్‌టీ కింద తెలంగాణకు రూ.1,500 కోట్లు

23 Dec, 2014 07:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: కేంద్ర అమ్మకం పన్ను (సీఎస్‌టీ) కింద ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,500 కోట్ల పరిహారం వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు దేశంలో అన్ని రాష్ట్రాల్లోని ప్రజలకు తక్కువ ధరకు లభించేందుకు వీలుగా కేంద్రం అమ్మకం పన్ను విలువను నాలుగు నుంచి రెండు శాతానికి తగ్గించడంతో.. రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పరిహారాన్ని ఇవ్వనుంది. కేంద్ర అమ్మకం పన్ను, రాష్ట్రాల విలువ ఆధారిత పన్ను కలిపితే వినియోగదారులపై అధిక భారం పడే అవకాశం ఉన్నందున, ధరల తగ్గింపునకు కేంద్ర ప్రభుత్వం సీఎస్‌టీని తగ్గించిన సంగతి విదితమే. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లోనూ పొందుపర్చడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు