వారికి కరోనా సోకలేదు: పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌

4 Mar, 2020 12:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో మంగళవారం నాటికి 47 మంది కోవిడ్‌-19(కరోనా వైరస్‌) అనుమానితులకు పరీక్షలు నిర్వహించినట్లు పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస రాజు తెలిపారు. వారిలో 45 మంది షాంపిల్స్‌ నెగటివ్‌గా తేలాయని పేర్కొన్నారు. మరో ఇద్దరి షాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపించామని తెలిపారు. గురువారం నాటికి ఇందుకు సంబంధించిన రిపోర్టులు వచ్చే అవకాశం ఉందని.. అప్పటివరకు వీరిద్దరిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ ఆస్పత్రిలో ఉంచుతామని స్పష్టం చేశారు. (కరోనా అలర్ట్‌: పోస్టర్‌ విడుదల చేసిన సర్కార్‌)

కాగా ఇటలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలారని శ్రీనివాస రాజు స్పష్టం చేశారు. అతడిని కలిసిన మరో వ్యక్తికి వైరస్‌ సోకినట్లుగా అనుమానిస్తున్నామన్నారు. ఇక వీరిద్దరు కాకుండా మిగిలిన 45 మంది నెగిటివ్‌గా తేలినప్పటికీ... 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాల్సిందిగా సూచించినట్లు తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని.. అతడిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మీడియా బులెటిన్‌ విడుదల చేసింది.(కరోనా వైరస్‌కు ‘సీ’ విటమిన్‌)

మరిన్ని వార్తలు