వలస కార్మికుల కోసం హెల్ప్‌డెస్క్‌

17 Apr, 2020 13:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: వలస కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ కార్మిక శాఖ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది.  తెలంగాణలో వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు లాక్‌డౌన్‌ కారణంగా వారి సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లేందుకు వీలు లేకుండాపోయింది. ఇలాంటి వారికి సహాయపడేందుకు హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసినట్టు తెలంగాణ సంయుక్త కార్మిక కమిషనర్‌ ఎన్‌. చతుర్వేది ఒక ప్రకటనలో తెలిపారు. పారిశ్రామిక రంగ కార్మికుల వేతన చెల్లింపులు, సంక్షేమం, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వలస కార్మికులు సమస్యల పరిష్కారం కోసం 94925 55379 (వాట్సప్‌)లో సంప్రదించాలని ఆయన సూచించారు. covid19cotr@gmail.comకు ఈ-మెయిల్‌ కూడా పంపొచ్చని చెప్పారు. 

హెచ్చార్సీ కేసుల విచారణ వాయిదా
లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో కేసుల విచారణను వాయిదా వేస్తున్నట్టు మానవ హక్కుల సంఘం(హెచ్చార్సీ) ప్రకటించింది. వాయిదా వేసిన కేసులను మే 9 నుంచి విచారి​స్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని 99631 41253, 90002 64345 నంబర్లలో సంప్రదించవచ్చు. (లాక్‌డౌన్‌.. మరిన్ని సడలింపులు ప్రకటించిన కేంద్రం)

మరిన్ని వార్తలు