సాధారణ పరీక్షగానే పరిగణిస్తారా? 

6 Jun, 2020 03:03 IST|Sakshi

టెన్త్‌ సప్లిమెంటరీపై ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు

నేడు ప్రత్యేకంగా విచారించనున్న ధర్మాసనం

సాక్షి, హైదరాబాద్ ‌: కరోనా తీవ్రత కారణంగా పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఆసక్తి చూపని విద్యార్థులు ఆగస్టు, సెప్టెంబర్‌లో జరిగే సప్లిమెంటరీలో పరీక్షలు రాస్తే వార్షిక పరీక్షలకు హాజరైనట్లుగా పరిగణిస్తారో లేదో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ప్రభుత్వ విధానాన్ని తెలుసుకుని శనివారం చెబుతానని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ చెప్పారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శనివారం ఈ వ్యాజ్యాన్ని ప్రత్యేకంగా విచారిస్తామని పేర్కొంది.

కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయి దా వేయాలని కోరుతూ బాలకృష్ణ, సాయిమణి వరుణ్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన పిల్స్‌ను శుక్రవారం ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. చిన్న స్కూల్స్‌లోని పరీక్ష కేంద్రాలను పెద్ద స్కూళ్లకు మార్పు చేసినవి 69 ఉన్నాయని, ఇలాంటి చోట్ల ప్రభుత్వం తీసుకున్న చర్యలపై వివరణ ఇవ్వాలని సూచించింది.  కేసులు అధికంగా నమోదవుతున్న ఈ పరిస్థితుల్లో విద్యార్థులను పరీక్షలకు పంపేందుకు తల్లిదండ్రులు సుముఖత చూపకపోవచ్చని, ఈ కారణంగా విద్యార్థులు నష్టపోవద్దనే కోణంలో ఆలోచించాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా, ఈ నెల 8 నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రభు త్వం నివేదించింది. కరోనా వైరస్‌ కారణంగా వైద్యపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నందున పరీక్షల నిర్వహణకు అనుమతివ్వాలని ఏజీ కోరారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.పవన్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. కరోనా వైరస్‌కు భయపడి తల్లిదండ్రులు తమ పిల్లలను పరీక్షలు రాయిం చేందుకు భయపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నా యన్నారు. పరీక్షలు రాయని విద్యార్థులు ఉంటే వాళ్లు సప్లిమెంటరీకి హాజరైనా రెగ్యులర్‌æ పరీక్షలు రాసినట్లుగా ప్రభుత్వం పరిగణించాలని కోరారు.

మరిన్ని వార్తలు