‘కట్న వేధింపులకూ ఆధారాలు ఉండాలి’ 

4 Oct, 2019 02:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కట్నం వేధింపుల కేసులో కచ్చి తమైన వాంగ్మూలం ఉన్నప్పుడే శిక్షలు విధించాలని, అరకొర వివరాల ఆధారంగా శిక్షలు విధించడం చెల్లదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడం వల్లే తన రెండో కుమార్తె చనిపోయిందని మృతు రాలి తండ్రి ఫిర్యాదు ప్రకారం పోలీసులు నమోదు చేసిన కేసులో రంగారెడ్డి జిల్లా పదో అదనపు కోర్టు వెలువరించిన తీర్పును సమర్థిస్తూ ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వెల్లడించింది.

భర్త తమ్ముడు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం భర్తతో కలసి అత్తమామలు  కట్న కోసం వేధించినందునే తన కుమార్తె మరణించిందని ఆరోపిస్తూ అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో మృతురాలి తండ్రి జంగారెడ్డి ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా కేసును కొట్టివేస్తున్నట్లు 2012 లో కింది కోర్టు తీర్పు చెప్పింది. దీనిపై జంగారెడ్డి దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను ఇటీవల హైకోర్టు కొట్టేసింది. 
 

>
మరిన్ని వార్తలు