సచివాలయం కూల్చివేతపై విచారణ వాయిదా

16 Oct, 2019 17:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని ప్రభత్వం వాదించింది. అందుకే నూతన సచివాలయం నిర్మిస్తున్నామని హైకోర్టుకు తెలిపింది. సచివాలయ భవనాల టెక్నికల్‌ రిపోర్ట్‌ను ధర్మాసనానికి సమర్పించింది. సుమారు 10 లక్షల ఎసేఫ్టీతో ఇంటిగ్రేటెడ్‌ సెక్రటేరియట్‌ను నిర్మిస్తామని హైకోర్టుకు వివరించింది. ప్రభుత్వ వాదనలు విన్న ధర్మాసనం.. ఏడేళ్ల క్రితం నిర్మించిన హెచ్‌ బ్లాక్‌ను ఎందుకు కూల్చి వేస్తున్నారని ప్రశ్నించింది. విధానపరమైన నిర్ణయాలలో కోర్టులు జోక్యం చేసుకోరాదని ప్రభుత్వం వాదించింది. అయితే దినిపై స్పందించిన ధర్మాసనం.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము ఎలా జోక్యం చేసుకోవాలో తెలపాలని పిటిషనర్‌ను కోరింది. తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు