ఆర్టీసీ జీతభత్యాలపై విచారణ 27కు వాయిదా

25 Nov, 2019 14:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల జీతభత్యాల పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేరని, కొంత సమయం కావాలని ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై పిటిషనర్ స్పందిస్తూ.. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఇప్పటికే 30 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. తదుపరి విచారణ ఈ నెల 27కు హైకోర్టు వాయిదా వేసింది.

ఆర్టీసీ బస్సు ప్రమాదాలపై విచారణ..
తాత్కాలిక సిబ్బందిని నియమించడంతో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదాలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. అనుభవం లేని తాతాల్కిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించడంతో చాలా ప్రమాదాలు జరిగాయని, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఆర్టీసీ ఎండీ, రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ ప్రిన్సిపల్‌ సెకట్రరీలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు కోర్టు వాయిదా వేసింది.

భవిష్యత్తు కార్యాచరణపై ఆర్టీసీ జేఏసీ సమావేశం..
ఆర్టీసీ భవిష్యత్తు కార్యాచరణపై సోమవారం ఆర్టీసీ జేఏసీ సమావేశం జరిగింది. ఆర్టీసీ కార్మిక నేతలు ఆశ్వత్ధామరెడ్డి, రాజిరెడ్డిలతో పాటు కోదండరాం తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మె-భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరిగింది. కేంద్రాన్ని కలిసే యోచనలో ఆర్టీసీ జేఏసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్లు ఆర్టీసీ జేఏసీ కోరింది.

మరిన్ని వార్తలు