తెలంగాణ ప్రభుత్వానికి భారీ షాక్‌

16 Sep, 2019 17:15 IST|Sakshi

ఎర్రమంజిల్‌ భవనాలను కూల్చవద్దని ఆదేశం

మంత్రివర్గ నిర్ణయాన్ని కొట్టిపారేసిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊహించని షాక్‌​ తగిలింది. ఎర్రమంజిల్‌లోని పురాతన భవనాలను కూల్చి నూతన అసెంబ్లీని నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టిపారేసింది. ఎర్రమంజిల్‌లోని చారిత్రాత్మక భవనాలను కూల్చి ఆ స్థానంలో కొత్త భవనాలకు తెలంగాణ ప్రభుత్వం భూపూజ కూడా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రివర్గం కూడా ఏకగ్రీవం తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో ఎర్రమంజిల్‌ భవనాలను కూల్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటినీ కలిపి ఉమ్మడిగా విచారించిన ధర్మాససం సుధీర్ఘ వాదనల అనంతరం సోమవారం తన తీర్పును వెలువరించింది. పురాతన భవనాల కూల్చివేతను తప్పుపడుతూ.. వాటిని కూల్చివేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.కాగా ఎర్రమంజిల్‌ భవనాల కూల్చివేతపై జూలై 3 నుంచి హైకోర్టులో పలు దఫాలుగా వాదనలు సాగుతోన్న విషయం తెలిసిందే. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. భవనాలను కూల్చివేసి వాటి స్థానంలో కొత్తవాటిని నిర్మించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త భవనం నిర్మిస్తే ట్రాఫిక్‌ సమస్యతో తలెత్తడంతోపాటు పురాతన కట్టడాలను పరిరక్షించాల్సిన ప్రభుత్వ బాధ్యతను విస్మరించినట్టు అవుతుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీరి వాదనతో ఏకీభవించిన ధర్మాసనం  ప్రభుత్వ నిర్ణయాన్ని తొసిపుచ్చింది. ఇదిలావుండగా.. తాజా హైకోర్టు తీర్పుతో ప్రభుత్వ తదుపరి నిర్ణయంపై ఆసక్తినెలకొంది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందింస్తో వేచి చూడాలి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోడెల మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి

హుజూర్‌నగర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతాం

డ్రెస్‌ కోడ్‌ విషయంలో విద్యార్థినుల ఆందోళన

ఉపరాష్ట్రపతితో గవర్నర్‌ తమిళసై భేటీ

ఎకరా తడవట్లే..

ఉద్యోగులేరీ?

క్రికెట్‌ క్రేజ్‌

పత్తికి దెబ్బే..!

బెదిరించి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారు

బుసకొట్టిన నాగన్న

మీ వాహనం అమ్మేశారా..?

ఖమ్మంలో ఉలికిపాటు..

గురుకులాల్లో మనబడి–మనగుడి

‘కేసీఆర్‌ వాస్తవాలు మాట్లాడారు’

అందరికీ అండగా హాక్‌-ఐ

తమిళనాడు తాటిబెల్లం

పదేళ్లు సీజ్‌ చేసిన పీడీఎస్‌ బియ్యం కిలో రూ.15

లండన్‌ ససెక్స్‌లో ఏం జరిగింది..!?

సమ్మెకు సై అంటున్న ఆర్టీసీ కార్మికులు

ప్రభుత్వ భూములపై దృష్టి సారించిన యంత్రాంగం

షూటింగ్‌లకు నిలయం.. ఆ ఆలయం

హరితలోగిళ్లు.. ఈ అంగన్‌వాడీలు

విద్యుత్‌ శాఖలో అంతా మా ఇష్టం

గుట్కా కేసుల దర్యాప్తు అటక పైకే!

సేవ్‌ నల్లమల

అద్దె ఎప్పుడిస్తరు?

పిల్లలమర్రిలో ఆకట్టుకునే శిల్పసంపద

సంగీతంతో ఎక్కువ పాలు ఇస్తున్న ఆవులు

నడకతో నగరంపై అవగాహన

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విజయ్‌ దేవరకొండ మూవీ అప్‌డేట్‌!

రాహుల్‌ కోసం పునర్నవి ఎంతపని చేసిందంటే..?

శ్రీముఖికి షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌

‘శకుంతలా దేవీ’ మొదలైంది!

‘మాకు విజయశాంతే కావాలి అనేవారు’

లత విమర్శించినా.. రాణు మాత్రం..!