గూగుల్‌పై హైకోర్టు సీరియస్‌ వ్యాఖ్యలు

20 Aug, 2019 14:03 IST|Sakshi

ఫేస్‌బుక్‌ నుంచి పోర్న్‌ సైట్లలో ఫొటోలు

సాక్షి, హైదరాబాద్‌ : పోర్న్‌ వెబ్‌సైట్లపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. అశ్లీల వెబ్‌సైట్ల బరితెగింపుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫేస్‌బుక్‌లో ఉన్న పేర్లు, ఫొటోలను తీసుకుని పోర్న్‌ వెబ్‌సైట్లలో పెడుతున్నారని ఓ యువతి హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, ఫోటోలను పోర్న్‌ వెబ్‌సైట్ల నుంచి తొలగించాలని గతంలో గూగుల్ సంస్థకు ఫిర్యాదు చేసినట్టు ఆమె కోర్టు దృష్టికి తెచ్చారు.

గూగుల్ సంస్థ పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. పోర్న్‌ సైట్లు రూపొందిస్తున్న వారిపట్ల గూగుల్ సంస్థ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. అశ్లీల వెబ్‌సైట్లను కట్టడి చేయాలని గూగుల్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. పోర్న్‌ సైట్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని గూగూల్‌కు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబర్1 కి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది.

మరిన్ని వార్తలు