‘హైకోర్టు’ కోసం రెండో రోజు దీక్ష

11 Feb, 2015 05:49 IST|Sakshi
‘హైకోర్టు’ కోసం రెండో రోజు దీక్ష

నిజామాబాద్ లీగల్ :తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు జిల్లా కోర్టు ఆవరణలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరాయి. రెండో రోజు దీక్షలో మంజీత్ సింగ్, సీహెచ్ సాయిలు, సతీశ్ కుమార్, గోవర్ధన్, సత్యనారాయణ గౌడ్ కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ సందర్శించి, దీక్షలకు సంఘీభావం తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎన్‌ఎల్ శాస్త్రి, నారాయణరెడ్డి, ప్రతినిధులు శ్రీనివాస్, మాణిక్ రాజు, జగన్మోహన్ గౌడ్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు.
 
నేడు తెయూ బంద్
తెయూ(డిచ్‌పల్లి) : తెలంగాణ ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు చేపట్టిన దీక్షకు మద్దతుగా బుధవారం తెలంగాణ యూనివర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చినట్లు లా విద్యార్థులు తెలిపారు. మంగళవారం వర్సిటీ లా కళాశాల విద్యార్థులు సంతోష్ గౌడ్, నవీన్ కుమార్, రాజేశ్వర్, శేఖర్, నాగార్జున, జైపాల్ విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు విభజన చేయకుండా కావాలనే కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. ఇప్పుడున్న హైకోర్టులో సీమాంధ్రుల ఆధిపత్యం కొనసాగుతోందన్నారు. వెంటనే హైకోర్టును విభజించాలని డిమాండ్ చేశారు.

బంద్‌కు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌గౌడ్, టీఎస్ జేఏసీ జిల్లా చైర్మన్ యెండల ప్రదీప్, ఏబీవీపీ తెయూ ఇన్‌చార్జి రమణ, ఎన్‌ఎస్‌యూఐ తెయూ ఇన్‌చార్జి రాజ్‌కుమార్, టీజీవీపీ ఇన్‌చార్జి మనోజ్ మద్దతు ప్రకటించారు.

మరిన్ని వార్తలు