వసతి గృహాల్లో నేలపైనే బాలింతలు.. నేడు హైకోర్టులో విచారణ

15 Apr, 2020 08:17 IST|Sakshi

రెండు లేఖలను పిల్స్‌గా స్వీకరించిన హైకోర్టు

నేడు విచారించనున్న ధర్మాసనం

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా కారణంగా జంటనగరాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతి గృహాల్లోని వారికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్‌) హైకో ర్టు బుధవారం విచారణ జరపనుంది.  కరోనా వైరస్‌ బాధితులు, అనుమానితులకు వైద్యం అందించే వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి భద్రత, రక్షణ కలి్పంచాలనే పిల్‌ను కూడా విచారణ చేయనుంది. ఇద్దరు న్యాయవాదులు వేరువేరుగా రాసిన లేఖలను హైకోర్టు పిల్స్‌గా స్వీకరించింది. జంటనగరాల్లో తాత్కాలిక వసతి గృహాలు 8 ఏర్పాటు చేశారని, వాటిలో వారందరూ భౌతిక దూరం పాటించడం లేదంటూ న్యాయవాది వసుదా నాగరాజ్‌ లేఖ రాశారు. ఆ గృహాల్లో ఇటీవలే పుట్టిన పిల్లలు, బాలింతలు ఉన్నారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ అనుమానితులు, బాధితులకు వైద్యం అందజేసే వారికి భద్రతతోపాటు రక్షణ కూడా కలి్పంచేలా  ఉత్తర్వులివ్వాలంటూ న్యాయవాది పి.ఎస్‌.ఎస్‌. కైలాశ్‌ నాథ్‌ అనే మరో న్యాయవాది రాసిన లేఖను కూడా హైకోర్టు బుధవారం విచారించనుంది. 
 

మరిన్ని వార్తలు