బీఎస్సీ డేటా సైన్స్‌.. బీకాం అనలిటిక్స్‌

18 Feb, 2020 04:01 IST|Sakshi

డిగ్రీలో కొత్త కోర్సుల కోసం ఉన్నత విద్యామండలి చర్యలు

2020–21 నుంచే అమల్లోకి..

విధి విధానాల ఖరారుకు కమిటీ.. వచ్చే వారంలో తుది నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కొత్త కోర్సులు రాబోతున్నాయి. బీఎస్సీ డేటా సైన్స్, బీకాం అనలిటిక్స్‌ వంటి కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రారంభిం చింది. ఇందులో భాగంగా విధి విధానాలను ఖరారు చేసేందుకు అధికారులు, పారిశ్రామిక వర్గాలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సోమవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల ను పెంపునకు అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టాలని ఏకాభిప్రాయానికి వచ్చా రు. వచ్చే వారం రోజుల్లో మళ్లీ సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.

2020–21 విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సులను అమల్లోకి తేనున్నారు.  డిగ్రీలో ఇకపై మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌తోపాటు డేటా సైన్స్‌ను చదువుకోవచ్చు. బీకాంలో బిజినెస్‌ అనలిటిక్స్‌ను చదువుకునే వీలు కల్పించనుంది. వీటిల్లోనే ఆనర్స్‌ డిగ్రీలను కూడా ప్రవేశపెట్టాలని భావిస్తోంది. రెగ్యులర్‌ డిగ్రీల కంటే ఆనర్స్‌ డిగ్రీల్లో 20 నుంచి 30 క్రెడిట్స్‌ ఎక్కువగా ఇచ్చి అమలు చేయాలని యోచిస్తోంది. ఇవి కాకుండా కాలేజీలు ముందుకొస్తే బీఎస్సీ మెషీన్‌ లెర్నింగ్, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ కోర్సులను ముందుగా సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులాలు, అటానమస్‌ కాలేజీలు, ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఆ సబ్జెక్టులను బోధించే ఫ్యాకల్టీకిచ్చే శిక్షణలో పారి శ్రామిక వర్గాలను భాగస్వాములను చేయనుంది. భేటీలో కమిటీ సభ్యులు, ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, ఓయూ మాజీ వీసీ రామచంద్రం, ప్రొఫెసర్లు ఫాతిమా బేగం, జయశ్రీ, ఓయూ రిజిస్ట్రార్‌ గోపాల్‌రెడ్డి, ట్రిపుల్‌ ఐటీ ప్రొఫెసర్‌ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. 


 

మరిన్ని వార్తలు