రీ వెరిఫికేషన్‌ కోసం 8 కేంద్రాలు

24 Apr, 2019 16:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇంటర్మీడియెట్‌ ఫలితాల వెల్లడిలో చోటుచేసుకున్న తప్పిదాలకు నిరసనగా గత నాలుగు రోజులుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.  విద్యార్థి సంఘాల నాయకులతోపాటు ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నేతలు కూడా వారికి జత కలిశారు. వారంతా బోర్డు కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద తీవ్ర ఉద‍్రిక‍్తత కొనసాగుతోంది.

విద్యార్థులు రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా బోర్డు వెబ్‌సైట్‌, యాప్‌ ఓపెన్‌ కాకపోవడంతో పలు ఇక్కట్లు పడుతున్నారు. విద్యార్థుల ఆందోళన దృష్ట్యా స్పందించిన ఇంటర్‌ బోర్డు రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ కోసం హైదరాబాద్‌లో ఎనిమిది సెంటర్లను ఏర్పాటు చేసింది. రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేయదలిచిన విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా (bie.telangana.gov.in) మరియు TSONLINE ద్వారా దిగువ ఇచ్చిన కేంద్రాల్లో రీ వెరిఫికేషన్‌ కోసం రూ.600, రీ కౌంటింగ్‌కు రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.

జిల్లా ఇంటర‍్మీడియెఓట్‌ విద్యా అధికారి (డీఐఈవో) కార్యాలయం, మహబూబియా జూనియర్‌ కాలేజీ, గన్‌ఫౌండ్రి, హైదరాబాద్‌
ఎంఏఎం జూనియర్‌ కాలేజీ, నాంపల్లి హైదరాబాద్‌
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, కాచిగూడ, హైదరాబాద్‌
ప్రభుత్వ బాలుర జూనియర్‌ కాలేజీ, ఫలక్‌నుమా, హైదరాబాద్‌
(మొబైల్‌ నెంబర్‌: 9848781805)

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, హయత్‌ నగర్‌, రంగారెడ్డి జిల్లా
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, శంషాబాద్‌, రంగారెడ్డి జిల్లా
(మొబైల్‌ నెంబర్‌: 9848018284)

జిల్లా ఇంటర్మీడియోట్‌ విద్యా అధికారి (డీఐఈవో) కార్యాలయం, మల‍్కాజ్‌గిరి, మేడ్చల్‌ జిల్లా
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, కూకట్‌పల్లి, మేడ్చల్‌ జిల్లా 
మొబైల్‌ నెంబర్‌: 9133338584)

మరిన్ని వార్తలు