విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి

3 May, 2019 12:09 IST|Sakshi
కందుకూరు చౌరస్తాలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్న డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, జెడ్పీటీసీ జంగారెడ్డి తదితరులు

డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి డిమాండ్‌

కందుకూరులో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ 

కందుకూరు: ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, జెడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి డిమాండ్‌ చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఇంటర్‌ విద్యార్థుల ఆత్మశాంతిని కోరుతూ గురువారం రాత్రి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఎస్‌.కృష్ణనాయక్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. వెంటనే వారి వైఖరి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలన్ని ప్రభుత్వ వైఫల్యంతో జరిగినవేనని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించాల్సిందేనన్నారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి జానకీరామ్, జిల్లా ప్రధానకార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, ఎంపీటీసీలు నిమ్మల వెంకటేష్‌గౌడ్, ఎం.నర్సింహా, సర్పంచ్‌ మహేశ్, నాయకులు చల్లా బాల్‌రెడ్డి, రాణాప్రతాప్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, ప్రశాంత్, అజ్జు, రాంరెడ్డి, మల్లేష్, ఆంజనేయులు, దేవేందర్, శ్రీను, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు