ఫెయిలైన విద్యార్థులంతా పాస్‌

10 Jul, 2020 03:33 IST|Sakshi

వార్షిక పరీక్షల్లో తప్పిన ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులంతా ఉత్తీర్ణులే..

విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రద్దు

ప్రకటించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యారు. మార్చిలో జరిగిన వార్షిక పరీ క్షల్లో ఫెయిలైన 1,61,710 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులం దరినీ పాస్‌చేస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిం చాల్సి ఉన్నా, కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా వాటిని రద్దుచేస్తూ సీఎం ఈ నిర్ణయం తీసు కున్నారని వెల్లడించారు. ప్రస్తుతం ఉత్తీర్ణులైన ఈ విద్యార్థులంతా కంపార్ట్‌ మెంటల్‌లో పాసైనట్లుగా మార్కుల మెమోల్లో పేర్కొంటామని తెలిపారు.

విద్యార్థులు తమ మార్కుల మెమోలను ఈ నెల 31 తర్వాత సంబం ధిత కాలేజీల్లో పొంద వచ్చన్నారు. వార్షిక పరీక్షల్లో పాసై, తమకు తక్కువ మార్కులు వచ్చాయని, తాము బాగా రాసినా ఎందుకు ఫెయిలయ్యామని తెలుసు కునేందుకు మార్కుల రీ కౌంటింగ్, రీ వెరిఫికే షన్‌ కమ్‌ ఫొటో కాపీ కోసం దరఖాస్తు చేసు కున్న విద్యార్థుల ఫలితాలను పది రోజుల్లో వెల్ల డిస్తామని మంత్రి వివరించారు.  కాగా, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఫెయిలై, ప్రభుత్వ తాజా నిర్ణయంతో పాసైన విద్యార్థు లకు సంబంధించి ప్రథమ సంవత్సర బ్యాక్‌ లాగ్స్‌ ఏమైనా ఉన్నా.. వాటిలోనూ పాస్‌ చేస్తామని అధికారులు తెలిపారు.

ఫస్టియర్‌ విద్యార్థుల పరిస్థితేంటి?
ద్వితీయ సంవత్సర విద్యార్థులను పాస్‌చేసిన ప్రభుత్వం వార్షిక పరీక్షల్లోనే ఫెయిలైన 1,67,630 మంది ప్రథమ సంవత్సర విద్యార్థుల విషయమై ఎలాంటి ప్రకటన చేయలేదు. ద్వితీయ సంవత్సర విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోవద్దనే ఉద్దేశంతో అందరినీ పాస్‌ చేసింది. అయితే ప్రథమ సంవత్సర విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారా? లేదా? అనేది స్పష్టం చేయలేదు. కరోనా అదుపులోకి వచ్చాక పరీక్ష పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. లేదంటే వచ్చే ఏడాది వార్షిక పరీక్షలతో ప్రథమ సంవత్సరంలో ఫెయిలైన పరీక్షలను కూడా రాసుకోవాల్సి వస్తుంది.

అప్పుడు పరీక్షలు రాయాలంటే ప్రథమ సంవత్సరంలో ఫెయిలైన పరీక్షలతోపాటు ద్వితీయ సంవత్సర పరీక్షలకు ఒకేసారి సిద్ధం కావాల్సి ఉంటుంది. దాంతో విద్యార్థులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అందుకే కరోనా అదుపులోకి వచ్చాక వారికి పరీక్షలను నిర్వహించేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. లేదంటే వారిని పాస్‌చేసే అంశంపైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ఓ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతానికి ముందుగా ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఎంసెట్, ఇతర సెట్స్‌ రాసుకునేలా, డిగ్రీలో ప్రవేశాలు పొందేలా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. లేకపోతే వారు విద్యా సంవత్సరం నష్టపోతారని, అందుకే ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా