దావోస్‌లో బిజీబిజీగా మంత్రి కేటీఆర్‌

24 Jan, 2018 18:17 IST|Sakshi

దావోస్‌ : పెట్టుబడులను పెద్దఎత్తున తెలంగాణకి రప్పించేందుకు దావోస్ వెళ్లిన రాష్ట్ర పరిశ్రమల శాఖ, ఐటీ మంత్రి కేటీఆర్‌ అక్కడ బిజిబిజీగా వున్నారు. రెండు రోజుల మంత్రి పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎయిర్ ఏషియా గ్రూప్‌ సీఈవో ఫెర్నాండెస్‌తో పాటు, ఇండోరామ, మిత్సుబిషి, కేకేఆర్‌, కల్యాణి గ్రూప్‌, నోవార్టిస్‌, డెలాయిట్‌ వంటి కంపెనీ సీనియర్‌ మేనేజ్‌మెంట్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణలో నోవార్టిస్ కార్యకలాపాల విస్తరణకు ఆ కంపెనీ అంగీకారం తెలిపింది. నోవార్టిస్.. ల్యాబోరేటరీ వ్యవస్థను, సిబ్బందిని రెట్టింపు చేయనుంది. 

కంపెనీ విస్తరణతో జీనోమ్ వ్యాలీ అభివృద్ది చెందుతుందని కేటీఆర్ తెలిపారు. అదేవిధంగా తెలంగాణలో టెక్‌ సెంటర్‌ ఏర్పాటుచేసేందుకు, ఇతర పెట్టుబడుల గురించి కేటీఆర్‌, దుబాయ్‌ పెట్టుబడుల కార్పొరేషన్‌ సీఈవో మహమ్మద్‌ ఏఐ షాబానితో కూడా చర్చించారు. హెచ్‌పీ కంపెనీ మేనేజ్‌మెంట్‌ను కూడా హైదరాబాద్‌ను సందర్శించాలని ఆహ్వానించారు. టీహబ్‌తో సహకారం ఏర్పరుచుకునేందుకు అన్వేషించాలని, హెచ్‌పీ తన కార్యకలాపాలను హైదరాబాద్‌లో విస్తరించాలని కోరారు.  జపనీస్ స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్ పార్క్ ఏర్పాటు చేయాలని కూడా కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.


 

>
మరిన్ని వార్తలు