‘సీరో’తో ‘తెలంగాణ జాగృతి’ ఒప్పందం

8 Oct, 2016 02:41 IST|Sakshi
‘సీరో’తో ‘తెలంగాణ జాగృతి’ ఒప్పందం

సాక్షి, హైదరాబాద్: సిడ్నీ - సీరో లెర్నింగ్ సంస్థతో తెలంగాణ జాగృతి నైపుణ్య అభివృద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, సీరో లెర్నింగ్ సంస్థ గ్లోబల్ ఆపరేషన్‌‌స డెరైక్టర్ ఆశిశ్ ఆర్ కట్టా అవగాహన పత్రాలపై సంతకాలు చేశారు. క్వీన్‌‌స లాండ్ కేం ద్రంగా పనిచేస్తున్న సీరో సంస్థ ఆస్ట్రేలియా, లావోస్, సింగపూర్, పీఎన్‌జీలలో ఒకేషనల్ ఎడ్యుకేషన్‌లో నాణ్యమైన శిక్షణ అందిస్తోంది. తెలంగాణ జాగృతి రాష్ట్ర వ్యా ప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తోంది. సీరోతో ఒప్పందం వల్ల జాగృతి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లలో చేరిన నిరుద్యోగులకు శిక్షణ అందుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

 కవితకు ఘన స్వాగతం
 సిడ్నీలో జరిగే బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లిన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు టీఆర్‌ఎస్ ఎన్నారైలు, తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో సీరో సంస్థ ప్రతినిధి శ్రీకర్ రెడ్డి, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు కొండపల్లి సంతోశ్‌కుమార్, కోరబోరుున విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు