రైతు ఆత్మహత్యలపై రౌండ్ టేబుల్ సమావేశం

13 Sep, 2015 19:05 IST|Sakshi

హైదరాబాద్: రైతు ఆత్మహత్యలపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత తోపాటు పలువురు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. రైతుల ఆత్మహత్యలకు దారితీస్తున్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను జాగృతి సంస్థ ఆదుకుంటుందని కవిత స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు పిల్లలను చదివిస్తామని చెప్పారు. పంటబీమా విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత నిబంధనలు మార్చాలని కోరారు. 2009 తర్వాత చోటు చేసుకున్న పరిణామాల వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని కవిత పునరుద్ఘాటించారు.

ఆత్మహత్యలు చేసుకున్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని టి.జేఏసీ ఛైర్మన్ కోదండరాం కోరారు. రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను ప్రభుత్వం సమీక్షించాలన్నారు. తక్షణమే రైతులకు రూ.5 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
 

మరిన్ని వార్తలు