తెలంగాణ జెన్‌కోకు ఓకే

18 May, 2014 03:21 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జెన్‌కో పేరుతో ప్రత్యేకంగా కంపెనీని రిజిస్టర్ చేసేందుకు జెన్‌కో పాలకమండలి ఆమోదముద్ర వేసింది. విద్యుత్ సౌధలో శనివారం జెన్‌కో పాలకమండలి(బోర్డు) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ జెన్‌కోకు ఆస్తుల పంపిణీకి కూడా బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏ ప్రాంతంలోని విద్యుత్ ప్లాంట్లు అదే ప్రాంతానికి చెందే విధంగా ఆస్తులను పంపిణీ చేయాలని బోర్డు నిర్ణయించింది. బోర్డు సమావేశంలో చైర్మన్ ఎస్‌కే జోషి, ఎండీ విజయానంద్‌తో పాటు డెరైక్టర్లు సత్యమూర్తి, బలరాం పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు