తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోలను ఏర్పాటు చేయండి

2 May, 2014 02:14 IST|Sakshi

గవర్నర్ కార్యాలయం నుంచి ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థలను ఏర్పాటుచేయాలని గవర్నర్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు గవర్నర్ సలహాదారు నుంచి జెన్‌కో, ట్రాన్స్‌కో యాజమాన్యాలకు లేఖలు అందినట్టు తెలిసింది. ఇందుకనుగుణంగా కొత్త సంస్థల ఏర్పాటుకు ఆయా యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్నాయి.
 
 వాస్తవానికి కొత్త వాటిని ఏర్పాటుచేయాలంటే కేబినెట్ ఆమోదం తప్పనిసరి. కంపెనీ లక్ష్యాలు, ఉద్దేశాలకు కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాతే వాటిని రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా కంపెనీలు ఏర్పాటుచేసుకోవాలని మొదట్లో భావించారు. అయితే, ప్రస్తుతం రాష్ర్టపతి పాలన నేపథ్యంలో గవర్నర్ ఆమోదం తెలిపితే కేబినెట్ ఆమోదం తెలిపినట్టేనని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. దీంతో తాజాగా తెలంగాణకు ప్రత్యేక కంపెనీలను ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ గవర్నర్ కార్యాలయం అన్ని ప్రభుత్వరంగ సంస్థలు, కంపెనీలకు లేఖలు రాసినట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు