కేటీఆర్‌ చొరవ.. 39 మందికి విముక్తి

17 Jun, 2019 19:18 IST|Sakshi

సౌదీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న గల్ఫ్‌ కార్మికులు

ఫలించిన కేటీఆర్‌, విదేశాంగశాఖ దౌత్యం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ చొరవతో గల్ఫ్‌లో మగ్గుతున్న 39 మంది తెలంగాణ కార్మికులకు విముక్తి లభించింది. సౌదీ అరేబియాలోని జే అండ్‌ పీ కంపెనీలో దాదాపు ఏడాదిన్నర కాలంగా బంధించబడ్డ కార్మికులు ఈరోజు హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌కు చేరుకున్న వారికి  ప్రయాణ ఖర్చుల నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ఆర్థికసాయం చేసింది. కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది కార్మికులు గత ఏడాది సౌదీలో నిర్మాణరంగ సంస్థలో పని కోసం వెళ్లారు. అయితే గత ఆరు నెలలుగా వారికి ఎలాంటి వేతనాలు ఇవ్వకుండా కంపెనీ పని చేయించుకోవడంతో పాటు సరైన, ఆహారాన్ని కూడా సంస్థ అందించలేకపోయింది.

అనేక కష్టాలు పడుతున్న కార్మికులు తమ సమస్యను ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కి తెలియజేశారు. దీంతో కార్మికుల సమస్యల పైన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కేటీఆర్ కోరారు. దీంతోపాటు కేంద్ర విదేశాంగ అధికారుల సహాయం కూడా తీసుకోవాలని కేటీఆర్‌ ఆదేశించారు. వారందరి కృషి ఫలితంగా కార్మికులు తెలంగాణ గడ్డమీద అడుగుపెట్టారు. సౌదీ నుంచి తెలంగాణ కార్మికులు స్వరాష్ట్రానికి చేరుకోవడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సౌదీలోని భారత రాయభార కార్యాలయంతోపాటు, తెలంగాణ ఎన్నారై శాఖాధికారులకు దన్యవాదాలు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

చాలా మంది టచ్‌లో ఉన్నారు..

‘ఆలంబాగ్‌’ ఏమైనట్టు!

ఇంటికే మొక్క

‘క్యాష్‌లెస్‌’ సేవలు

కాంగ్రెస్‌ టు బీజేపీ.. వయా టీడీపీ, టీఆర్‌ఎస్‌

ప్రియుడి చేత భర్తను చంపించిన భార్య

పరిమళించిన మానవత్వం

ఆశల పల్లకిలో ‘కొత్తపల్లి’

ఒకే రోజులో ట్రిపుల్‌ సెంచరీ

ట్రిబుల్‌..ట్రబుల్‌

పెబ్బేరులో మాయలేడి..!

వైఎంసీఏలో ఫుడ్‌ పాయిజన్‌

పూడ్చిన శవాలను కాల్చేందుకు యత్నం 

పల్లె కన్నీరుపెడుతుందో..

చచ్చినా చావే..!

మళ్లీ ‘స్వైన్‌’ సైరన్‌!

కేన్సర్‌ ఔషధాల ధరల తగ్గింపు!

ఎంసెట్‌ స్కాంలో ఎట్టకేలకు చార్జిషీట్‌

యాప్‌ టికెట్‌.. టాప్‌

చెరువుల పరిరక్షణకు ముందుకు రావాలి

విన్‌.. సోషల్‌ ప్రొటీన్‌

అమల్లోకి ప్రైవేటు వర్సిటీల చట్టం

కళాత్మక దంపతులు

హీరా కుంభకోణంపై దర్యాప్తు ఇలాగేనా?

టిక్‌టాక్‌ చేసిన సిబ్బందిపై చర్యలు

దేశవ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

‘దామరచర్ల’కు డబుల్‌ ట్రాక్‌ లైన్‌

ఎర్రమంజిల్‌ భవనాన్ని హెచ్‌ఎండీఏ కాపాడాలి 

భూ రికార్డులను సంస్కరించాలి 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

యుద్ధానికి సిద్ధం

వసూళ్లు పెరిగాయి

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు