తెలంగాణ న్యాయవాదుల ఆందోళన

6 Jun, 2016 13:04 IST|Sakshi

హైదరాబాద్ : తెలంగాణవ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. సీమాంధ్రకి చెందిన న్యాయమూర్తులు ఆప్షన్ విధానం ద్వారా తెలంగాణలో పని చేయడాన్ని నిరసిస్తూ వాళ్లు నిరసన తెలుపుతున్నారు. ఆప్షన్ విధానాన్ని రద్దు చేసి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటు చేసుకొని ఆంధ్ర న్యాయమూర్తులు అక్కడికి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.

42 మంది ఆంధ్ర న్యాయమూర్తులని తెలంగాణలో నియమించాలన్న కుట్రలను మానుకోవాలని న్యాయమూర్తులు సూచించారు. రంగారెడ్డి కోర్ట్‌ల సముదాయం ఎదుట విధులను బహిష్కరించిన న్యాయవాదులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

 

మరిన్ని వార్తలు