రెండవ రోజు హైకోర్టు న్యాయవాదుల ఆందోళన

4 Sep, 2019 11:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో న్యాయవాదుల ఆందోళన రెండవ రోజుకు చేరింది. బదిలీలకు నిరసనగా బుధవారం తెలంగాణ హెకోర్టు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. శనివారం వరకు రాష్ట వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులను బహిష్కరించాలని హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానించింది. జస్టీస్ సంజయ్ కుమార్‌ను వెంటనే తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా, తెలంగాణ  జస్టీస్ సంజయ్ కుమార్‌ను పంజాబ్, హర్యానా కోర్ట్‌కు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ న్యాయవాదుల ఆందోళన  చేపట్టిన సంగతి తెలిసిందే. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో న్యాయవాదులు తొలి సారి తమ నిరసన గళాన్ని విప్పారు. హైకోర్టులో నెంబర్‌ టు స్థానంలో ఉన్న సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్‌ను పంజాబ్‌ అండ్‌ హర్యానా హైకోర్టుకు జూనియర్‌ జడ్జిగా బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుపై న్యాయవాదులు మండిపడుతున్నారు.

త్వరలో రాష్ట్ర కోటా నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావాల్సిన వ్యక్తిని, ఈ విధంగా పంజాబ్‌ అండ్‌ హర్యానా హైకోర్టులో 12వ స్థానానికి బదిలీ చేస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో రాష్ట్ర కోటా నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావాల్సిన వ్యక్తిని, ఈ విధంగా పంజాబ్‌ అండ్‌ హర్యానా హైకోర్టులో 12వ స్థానానికి బదిలీ చేస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సిఫారసును వెనక్కి తీసుకోవాలని, ఆయనను ఏదైనా హైకోర్టు సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియంను డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సోదరుడి అంత్యక్రియలు వీడియో కాల్‌లో...

కోవిడ్‌ ఎఫెక్ట్‌ అద్దెలపైనా ప్రభావం...

ఆ నలుగురు..కరువయ్యారు!

శనివారం తెలంగాణ కేబినెట్‌ సమావేశం

మా వాళ్లు.. మీ వాళ్లే కరోనాతో స'పరివార్‌'

సినిమా

‘వాసు’గుర్తున్నాడా? వచ్చి 18 ఏళ్లైంది!

పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్‌ చేస్తున్నా: చిరు

దూరంగా ఉంటునే ఆశీర్వదించారు

కరోనా పోరు: మరోసారి అక్షయ్‌ భారీ విరాళం

కరోనా వైరస్‌ ; నటుడిపై దాడి

కథలు వండుతున్నారు