నేరళ్ల ఘటనలో ఎస్పీని మంత్రి కేటీఆర్‌ రక్షిస్తున్నారు..

14 Aug, 2017 12:29 IST|Sakshi
హైదరాబాద్‌: సిరిసిల్ల రాజన్న జిల్లాలోని నేరెళ్ల దళితులపై జరిగిన దాడి ఘటనలో ఎస్పీని మంత్రి కేటీఆర్‌ రక్షిస్తున్నారని అఖిలపక్ష నాయకులు సోమవారం గవర్నర్‌ నరసింహాన్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో దళితుల జీవితాలకు విలువ లేకుండా పోయిందని, ఇసుక మాఫియాతో కేటీఆర్‌కు సంబంధాలున్నాయని గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
 నేరెళ్ల దళితులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన వారిలో ఎస్పీ పాత్ర ఉందని, లారీని తగలబెట్టిన వారిని వదిలేసి అమయాకులను అరెస్ట్‌ చేశారని వారు గవర్నర్‌ను కోరారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేలా డీజీపీని ఆదేశించాలని, బాధితులకు ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించేలా కృషి చేయాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని, బాధితులకు పరిహారం చెల్లించి భద్రత కల్పించాలని కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎల్‌.రమణ, లక్ష్మణ్‌, చాడ వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు.
మరిన్ని వార్తలు