తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా

28 Nov, 2014 21:01 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. శుక్రవారం ద్రవ్యవినిమయ బిల్లును మండలి ఆమోదించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ బిల్లు ఆమోదానికి సహకరించింది. చివరి రోజు రెండు బిల్లులను సభ ఆమోదించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చివరిరోజు మాత్రమే శాసనమండలికి హాజరయ్యారు.

11 రోజుల్లో 49 గంటల 22 నిమిషాలు పాటు సమావేశాలు సాగాయి.  ఈసారి సమావేశాల్లో పలు అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. కాంగ్రెస్, టీడీపీ సభ్యుల పార్టీ ఫిరాయింపుపై పలుమార్లు సభ వాయిదా పడింది. కాగా ఈ అంశం తన పరిధిలో ఉందని మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు.

మరిన్ని వార్తలు