మిగులు నీళ్లన్నీ మావే 

6 Mar, 2019 02:46 IST|Sakshi

సాగర్‌లో లభ్యతగా ఉన్న నీరంతా తమదేనని కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ 

శ్రీశైలంలో తగ్గుతున్న నిల్వలు..

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన ఉన్న నీరంతా తమవేనని తెలంగాణ రాష్ట్రం కృష్ణాబోర్డుకు స్పష్టం చేసింది. శ్రీశైలంలో ఇప్పటికే కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లినందున, సాగర్‌లో కనీస మట్టాలకు ఎగువన ఉన్న 31.6 టీఎంసీల నీటి వాటా కింద తమకు దక్కేవని తెలిపింది. ప్రస్తుత లభ్యత నీటిలో ఏపీకి ఎలాంటి వాటా ఉండదని బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ కృష్ణాబోర్డుకు లేఖ రాశారు. గతంలో బోర్డు చేసిన కేటాయింపులకు అనుగుణంగా ఇరు రాష్ట్రాలు చేసిన నీటి వినియోగాన్ని దాని దృష్టికి తీసుకెళ్లారు. బోర్డు ఏపీకి 33.40 టీఎంసీలు కేటాయించగా, ఇప్పటికే ఆ రాష్ట్రం 33.39 టీఎంసీల నీటిని వినియోగించిందని వెల్లడించారు.

తెలంగాణకు 46.90 టీఎంసీల మేర కేటాయింపులు చేయగా, ఇందులో 31.71 టీఎంసీల మేర వినియోగించగా, మరో 15.19 టీఎంసీల మేర వాడుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం కనీస నీటి మట్టాలకు ఎగువన ఎలాంటి నీటి లభ్యత లేకపోగా, సాగర్‌లో మాత్రం 31.64 టీఎంసీల మేర ఉందని తెలిపారు. ఇందులో తెలంగాణ వినియోగించుకోవాల్సిన నీటి వాటాతో పాటు 13 టీఎంసీలను తెలంగాణ అవసరాలకు రిజర్వ్‌లో ఉంచారని, ఈ మొత్తాన్ని కలుపుకుంటే 28.19 టీఎంసీలు వాడుకోవాల్సి ఉందని లెక్కల ద్వారా తెలిపా రు. రెండు ప్రాజెక్టుల్లో కలిపి ఇప్పటి వరకు 577.99 టీఎంసీలకుగాను ఆంధ్రప్రదేశ్‌ 401.218 టీఎంసీలు (69.42 శాతం), తెలంగాణ 176.778 టీఎంసీలు (30.58 శాతం) వినియోగించుకుందని, రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ దామాషా ఏపీ 66 శాతం, తెలంగాణ 34 శాతంగా నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ లెక్కల దృష్ట్యా సాగర్‌లో లభ్యత నీరంతా తెలంగాణకే దక్కుతుందని పేర్కొంది.

శ్రీశైలంలో తగ్గుతున్న నిల్వ
శ్రీశైలంలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. ఇక్కడ 885 అడుగుల మట్టానికి గానూ ప్రస్తుతం 828.20 అడుగుల మట్టంలో 47.68 టీఎంసీల నిల్వలున్నాయి. నిజానికి శ్రీశైలం కనీస నీటి మట్టం 834 అడుగులు కాగా ఇప్పటికే దానికి దిగువన 5 టీఎంసీల మేర ఇరు రాష్ట్రాలు నీటి వినియోగం చేసేశాయి. మంగళవారం సైతం శ్రీశైలం నుంచి హంద్రీనీవా ద్వారా ఏపీ 960 క్యూసెక్కులు, కల్వకుర్తి ద్వారా తెలంగాణ 2.400 క్యూసెక్కుల నీటిని తరలించుకున్నాయి. శ్రీశైలంలో నిల్వలు తగ్గుతున్నా ఇప్పటివరకు కృష్ణా బోర్డు భేటీపై స్పష్టత రాలేదు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మా వాళ్లను విడిపించరూ..!

బట్టలూడదీసి పబ్‌ డ్యాన్సర్‌ను కొట్టారు..!

ప్రజల్లో అవగాహన పెరగాలి 

మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించాలి 

‘నీట్‌’ రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదల

సికింద్రాబాద్‌ టు నాగ్‌పూర్‌... సెమీ హైస్పీడ్‌ కారిడార్‌కు ఓకే!

నైరుతి ఆలస్యం.. తగ్గనున్న వర్షపాతం

సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే..!

18న ఐఆర్‌ ప్రకటన!

టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం

సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌పవర్‌ 

ఈ సినిమా ఎంతో హృద్యంగా ఉంది : కేటీఆర్‌

రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆ పేపర్‌పై ఎందుకు కేసు పెట్టలేదు: దాసోజు

రూ. 1.88 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

అందని ఆసరా 

బడిబాట షురూ

తహసీల్దార్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

రుణం.. మాఫీ అయ్యేనా!

నర్సింగ్‌ హోంలపై దాడులను అరికట్టాలి

జెడ్పీ కార్యాలయం కోసం అధికారుల వేట

క్లబ్‌ డ్యాన్సర్‌ బట్టలు విప్పి అసభ్యకరంగా..

వేల రూపాయల ఫీజులు కట్టలేని పేదలకు

రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో కలకలం

అభినందన సభలా..

వానమ్మ.. రావమ్మా 

సున్నా విద్యార్థులున్న స్కూల్స్‌126

నానాటికీ ... తీసికట్టు!

ఎయిర్‌పోర్ట్ ఉద్యోగిని పట్ల అసభ్య ప్రవర్తన

రైతు మెడపై నకిలీ కత్తి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పిల్లలకు మనం ఓ పుస్తకం కావాలి

లుక్‌ డేట్‌ లాక్‌?

అప్పుడు ఎంత అంటే అంత!

మల్లేశం సినిమాకు ప్రభుత్వ సహకారం ఉంటుంది

30న నిర్మాతల మండలి ఎన్నికలు

విరాటపర్వం ఆరంభం