జనతా కర్ఫ్యూకు మద్దతుగా లారీలు ఆపేస్తాం..

21 Mar, 2020 17:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) భాతరదేశంలో ప్రబలుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’  పాటించాలని పిలుపునిచ్చిన విషషయం తెలిసిందే. అయితే ప్రధాని మోదీ పిలుపుకు సర్వత్రా మద్దుతు తెలుపుతోంది. తాజాగా తెలంగాణ లారీ ఓనర్స్‌ అసోషియేషన్‌ రేపు జరగబోయే ‘జనతా కర్ఫ్యూ’కి తమ మద్దతు తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా లారీలను ఆపేస్తామని లారీ ఓనర్స్‌ అసోషియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నందారెడ్డి ప్రకటించారు. సుమారు పదిహేను లక్షల లారీలు ఈ ‘జనతా కర్ఫ్యూ’కి మద్దతు తెలిపాయని నందారెడ్డి అన్నారు. (జనతా కర్ఫ్యూ: తెలంగాణలో 24 గంటల బంద్‌!)

ఎల్బీనగర్‌: హైదరాబాద్‌ నగర వాసుల్లో కోవిడ్‌-19(కరోనా వైరస్‌) భయం పట్టుకుంది. దీంతో నగరవాసులు స్వస్థలాలకు భారీగా వెళ్తున్నారు. ఎల్బీనగర్‌  స్వంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల భారీ రద్దీతో కిటకిటలాడుతోంది. ఇదే అదునుగా ప్రైవేటు ట్రావెల్స్‌ ప్రయాణికులను అధిక చార్జీలతో దోచుకుంటున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్‌ రోడ్లపైనే వాహనాలు అడ్డంపెట్టి మరీ ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌ రెచ్చిపోతున్నా ఆర్టీసీ సిబ్బంది మాత్రం పట్టించుకోకపోవటం గమనార్హం. ఇంత జరుగుతున్నా ట్రాఫిక్‌ పోలీసులు కనిపించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. (నిలిచిపోనున్న రైళ్లు, మెట్రో, బస్సు సర్వీసులు)

>
మరిన్ని వార్తలు