ఈ గదులు చాలడం లేదు: మంత్రులు

1 Jul, 2014 10:26 IST|Sakshi
ఈ గదులు చాలడం లేదు: మంత్రులు

హైదరాబాద్: సచివాలయంలో తమ పేషీలకు కేటాయించిన చాంబర్లు ఏమాత్రం సరిపోవడంలేదని పలువురు తెలంగాణ మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అగ్గిపెట్టెల్లాంటి చాంబర్లు, గదుల్లో కార్యకలాపాల నిర్వహణ కష్టసాధ్యమవుతోందని ఆవేదన చెందుతున్నారు. ఒక్కో పేషీలో ఓఎస్డీ, పీఎస్, పీఏలతోపాటు పదిమందికిపైగా సిబ్బంది ఉన్నా ఒకే ఒక్క గదిని కేటాయించారని, దీనివల్ల ఫైళ్ల నిర్వహణ ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు.

గతంలో ఓఎస్డీ, పీఎస్‌లకు ప్రత్యేక చాంబర్‌ను కేటాయించేవారని, ఈసారి మాత్రం వారిద్దరితోపాటు అందరికీ కలిపి ఒకే గదిని కేటాయిస్తే ఫైళ్ల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. అదనపు గదులు కేటాయించాలని ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌అలీ, డాక్టర్ టి.రాజయ్య, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీష్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) అధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది. ఇప్పటి వరకు జీఏడీ అధికారుల నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం.
 

మరిన్ని వార్తలు