తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే

27 Jan, 2020 14:43 IST|Sakshi
హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన ఆకుల రజిత

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్రీయ సమితి(టీఆర్‌ఎస్‌) దుమ్మురేపింది. 120 మున్సిపాటీలకు గానూ 112 దక్కించుకుని సత్తా చాటింది. 8 మున్సిపాలిటీలు మాత్రమే కాంగ్రెస్(4)‌, బీజేపీ(2), ఎంఐఎం(2) దక్కించుకున్నాయి. అటు పది నగర పాలక సంస్థలనూ టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో ఒక్కస్థానం మినహా అన్నింటిని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. చండూరు మున్సిపాలిటీని కాంగ్రెస్‌ దక్కించుకుంది. కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఓటు వివాదంతో నేరేడుచర్లలో మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు.

1. నల్గొండ మున్సిపల్‌ చైర్మన్‌గా మందడి సైదిరెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ ఎన్నిర మంగళవారానికి వాయిదా పడింది.
2. మిర్యాలగూడ మున్సిపల్‌ చైర్మన్‌గా తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్‌గా కుర్ర కోటేశ్వరరావు ఎన్నిక
3. దేవరకొండ మున్సిపల్‌ చైర్మన్‌గా ఆలంపల్లి నర్సింహ్మ, వైస్ చైర్మన్‌గా ఎం.డీ రహాత్ అలీ ఎన్నిక
4. నందికొండ-సాగర్ మున్సిపల్‌ చైర్మన్‌గా కర్ణ అనూష వైస్ చైర్మన్‌గా మంద రఘువీర్ ఎన్నిక
5. హాలియా మున్సిపల్‌ చైర్మన్‌గా వెంపటి పార్వతమ్మ, వైస్ చైర్మన్‌గా సుధాకర్ ఎన్నిక
6. చిట్యాల మున్సిపల్‌ చైర్మన్‌గా కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి, వైస్ చైర్మన్‌గా కూరేళ్ల లింగస్వామి ఎన్నిక
7. చండూరు మున్సిపల్‌ చైర్మన్‌గా తోకల చంద్రకళ (కాంగ్రెస్), వైస్ చైర్మన్‌గా దోటి సుజాత ఎన్నిక
8. యాదాద్రి-భువనగిరి జిల్లా: భువనగిరి మున్సిపల్‌ చైర్మన్‌గా ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య ఎన్నిక
9. యాదగిరిగుట్ట మున్సిపల్‌ చైర్మన్‌గా ఎరుకల సుధ ఎన్నిక
10. ఆలేరు మున్సిపల్‌ చైర్మన్‌గా వసపరి శంకరయ్య ఎన్నిక
11. చౌటుప్పల్ మున్సిపల్‌ చైర్మన్‌గా వెన్ రెడ్డి రాజు, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం(సీపీఎం) ఎన్నిక
12. మోత్కూరు మున్సిపల్‌ చైర్మన్‌గా టిపిరెడ్డి సావిత్రి, వైస్ చైర్మన్‌గా బొల్లేపల్లి వెంకటయ్య ఎన్నిక
13. భూదాన్ పోచంపల్లి మున్సిపల్‌ చైర్మన్‌గా చిట్టిపోలు విజయలక్ష్మి, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి ఎన్నిక
14. సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపల్‌ చైర్మన్‌గా పెరుమాళ్ళ అన్నపూర్ణ, వైస్ చైర్మన్‌గా పుట్ట కిషోర్ ఎన్నిక
15. కోదాడ మున్సిపల్‌ చైర్మన్‌గ వనపర్తి శిరీష,వైస్ చైర్మన్‌గా వెంపటి పద్మ ఎన్నిక
16. హుజూర్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా అర్చన రవి, వైస్ చైర్మన్‌గా జక్కుల నాగేశ్వరరావు ఎన్నిక
17. తిరుమలగిరి మున్సిపల్‌ చైర్మన్‌గా పోతరాజు రజిని ఎన్నిక
18. నేరేడుచర్ల మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక మంగళవారం జరుగుతుంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 మున్సిపాలిటీల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేసింది. 9 చోట్ల కూడా టిఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులే చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు దక్కించుకున్నారు.

1. వరంగల్ రూరల్ జిల్లా: పరకాల మున్సిపల్ చైర్మన్‌గా సోదా అనిత, వైస్ చైర్మన్‌గా రేగురి జైపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక.
2. వర్ధన్నపేట నూతన మున్సిపాలిటి ఛైర్ పర్సన్‌గా అంగోత్ అరుణ,  వైస్ చైర్మన్‌గా కొమండ్ల ఏలందర్ రెడ్డి ఎన్నిక.
3. నర్సంపేట మున్సిపల్  చైర్మన్‌గా గుంటి రజని కిషన్, వైస్ చైర్మన్‌గా మునిగాల వెంకట రెడ్డి ఎన్నిక.
4. మహబూబాద్ మున్సిపల్ చైర్మన్‌గా డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా మహ్మద్ ఫరిద్ ఎన్నిక.
5. మహబూబాద్ జిల్లా: మరిపెడ మున్సిపల్ చైర్మన్‌గా గుగులోతు సిందూర, వైస్ చైర్మన్‌గా ముదిరెడ్డి బుచ్చిరెడ్డి ఎన్నిక.
6. డోర్నకల్ మున్సిపాలిటీ చైర్మెన్‌గా వంకుడొతు వీరన్న, వైస్ చైర్మన్‌గా కేసబోయిన కోటి లింగం ఎన్నిక.
7. మహబూబాబాద్ జిల్లా: తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ ఛైర్మన్‌గా జినుగ సురేందర్ రెడ్డి ఎన్నిక.
8. భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్‌గా సెగం వెంకట రాణి, వైస్ చైర్మన్‌గా కొత్త హరిబాబు ఎన్నిక.
9. జనగామ జిల్లా: జనగామ మున్సిపల్‌ చైర్మెన్‌గా పోకల జమున, వైస్ చైర్మన్‌గా మేకల రాంప్రసాద్ ఎన్నిక.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 15 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు చైర్మన్‌ పదవులను దక్కించుకున్నారు. బొల్లారంలో తప్ప అన్నిచోట్ల వైస్‌ చైర్మన్‌ పదవులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. బొల్లారంలో కాంగ్రెస్‌ అభ్యర్థి అంతిరెడ్డిగారి అనిల్‌రెడ్డి వైస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

1. సంగారెడ్డి రెడ్డి జిల్లా: సంగారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌గా బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్మన్‌గా లతారెడ్డి ఎన్నిక.
2. సదాశివపేట మున్సిపల్‌ చైర్మన్‌గా పిల్లోడి జయమ్మ, వైస్ చైర్మన్‌గా చింతా గోపాల్ ఎన్నిక.
3. ఆందోల్-జోగిపేట మున్సిపల్‌ చైర్మన్‌గా గూడెం మల్లయ్య, వైస్ చైర్మన్‌గా మాతరి ప్రవీణ్ కుమార్ ఎన్నిక.
4. నారాయణఖేడ్ మున్సిపల్‌ చైర్మన్‌గా రూబీనా బేగం, వైస్ చైర్మన్‌గా అయ్యర్ పరశురాం ఎన్నిక.
5. బొల్లారం మున్సిపల్‌ చైర్మన్‌గా కోలన్ రోజారాణి, వైస్ చైర్మన్‌గా అనిల్‌రెడ్డి (కాంగ్రెస్‌) ఎన్నిక.
6. అమీన్‌పూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌గా తుమ్మల పాండు రంగారెడ్డి, వైస్ చైర్మన్‌గా నందారం నర్సింహగౌడ్ ఎన్నిక.
7. తెల్లపూర్ మున్సిపల్‌ చైర్మన్‌గా మల్లేపల్లి లలిత, వైస్ చైర్మన్‌గా బలాగౌని రాములు ఎన్నిక.
8. మెదక్‌ జిల్లా: మెదక్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా తొడుపునూరి చంద్రపాల్, వైస్ చైర్మన్‌గా ఆరెల్ల మల్లికార్జున్ గౌడ్ ఎన్నిక.
9. నర్సాపూర్  చైర్మన్‌గా ఎర్రగొల్ల మురళి యాదవ్, వైస్ చైర్మన్‌గా ఎండీ నయీముద్దిన్ ఎన్నిక.
10. తూప్రాన్ చైర్మన్‌గా బొంది రవిందర్ గౌడ్, వైస్ చైర్మన్‌గా నందాల శ్రీనివాస్ ఎన్నిక.
11. రామాయంపేట చైర్మన్‌గా పల్లె జితేంద్ర గౌడ్, వైస్ చైర్మన్‌గా పుట్టి విజయలక్ష్మి ఎన్నిక.
12. సిద్ధిపేట జిల్లా: దుబ్బాక చైర్మన్‌గా గన్నె వనిత, వైస్ చైర్మన్‌గా సుగుణ బాలకిషన్ గౌడ్  ఎన్నిక.
13. చేర్యాల చైర్మన్‌గా అంకుగారి స్వరూప రాణి, వైస్ చైర్మన్‌గా నిమ్మ రాజీవ్‌కుమార్ రెడ్డి ఎన్నిక.
14. గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌ చైర్మన్‌గా నేతిచిన్న రాజమౌళి, వైస్ చైర్మన్‌గా ఎండీ జకీరుద్దీన్ ఎన్నిక.
15. హుస్నాబాద్ చైర్మన్‌గా ఆకుల రజిత, వైస్ చైర్మన్‌గా అయిలేని అనిత ఎన్నిక.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 17 మున్సిపాలిటీల్లో 16 చోట్ల టీఆర్‌ఎస్‌ పాగా వేసింది. కొల్లాపూర్‌, అయిజ, భూత్పూర్‌, కోస్గిలో మెజారిటీ సీట్లు లేకపోయినా చైర్మన్, వైస్ చైర్మన్‌ పదవులను టీఆర్‌ఎస్‌ దక్కించుకోవడం విశేషం. మక్తల్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ మద్దతుతో కమలం వికసించింది. అమరచింత వైస్ చైర్మన్‌గా సీపీఎం అభ్యర్థి గోపి ఎన్నికయ్యారు.

1. మహబూబ్‌నగర్ మున్సిపల్‌ చైర్మన్‌గా కోరమోని నర్సింహులు, వైస్ చైర్మన్‌గా గణేష్ ఎన్నిక.
2. భూత్పూర్ మున్సిపల్‌ చైర్మన్‌గా బస్వరాజ్ గౌడ్, వైస్ చైర్మన్‌గా కెంద్యాల శ్రీనివాస్ ఎన్నిక
3. వనపర్తి జిల్లా: అమరచింత మువ్సిపల్ చైర్మన్‌గా మంగమ్మ, వైస్ చైర్మన్‌గా గోపి (సీపీఎం) ఎన్నిక.
4. ఆత్మకూర్ మున్సిపల్‌ చైర్మన్‌గా గాయత్రి, వైస్ చైర్మన్‌గా విజయ్ భాస్కర్‌ రెడ్డి ఎన్నిక.
5. కొత్తకోట మున్సిపల్‌ చైర్మన్‌గా పొగాకు సుకేషిని, వైస్ చైర్మన్‌గా బీసం జయమ్మ ఎన్నిక.
6. వనపర్తి మున్సిపల్‌ చైర్మన్‌గా గాలి యాదవ్, వైస్ చైర్మన్‌గా వాకాటి శ్రీధర్‌ ఎన్నిక.
7. పెబ్బేరు మున్సిపల్‌ చైర్మన్‌గా కరుణశ్రీ, వైస్ చైర్మన్‌గా మేకల కర్రెస్వామి ఎన్నిక.
8. నాగర్ కర్నూల్ జిల్లా: కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్‌గా ఎడ్మ సత్యంరెడ్డి, వైస్ చైర్మన్‌గా షాహీద్ ఎన్నిక.
9. కొల్లాపూర్ మున్సిపల్‌ చైర్మన్‌గా విజయలక్ష్మి, వైస్ చైర్మన్‌గా మహదాబేగం ఎన్నిక.
10. నాగర్ కర్నూల్ మున్సిపల్‌ చైర్మన్‌గా కల్పనా భాస్కర్ గౌడ్, వైస్ చైర్మన్‌గా భాస్కరరావు ఎన్నిక.
11. జోగులాంబ గద్వాల జిల్లా: వడ్డేపల్లి మున్సిపల్‌ చైర్మన్‌గా కరుణ, వైస్ చైర్మన్‌గా సుజాత ఎన్నిక.
12. అలంపూర్ మున్సిపల్‌ చైర్మన్‌గా మనోహరమ్మ, వైస్ చైర్మన్‌గా శేఖర్ ఎన్నిక.
13. అయిజ మున్సిపల్‌ చైర్మన్‌గా దేవన్న, వైస్ చైర్మన్‌గా మాల నర్సింహులు ఎన్నిక.
14. గద్వాల మున్సిపల్‌ చైర్మన్‌గా బి.ఎస్ కేశవ్, వైస్ చైర్మన్‌గా బాబర్ ఎన్నిక.
15. నారాయణపేట జిల్లా: మక్తల్ మున్సిపల్‌ చైర్మన్‌గా పావని(బీజేపీ), వైస్ చైర్మన్‌గా అఖిలారెడ్డి(బీజేపీ) ఎన్నిక.
16. కోస్గి మున్సిపల్‌ చైర్మన్‌గా శిరీష, వైస్ చైర్మన్‌గా అన్నపూర్ణ ఎన్నిక
17. నారాయణపేట మున్సిపల్‌ చైర్మన్‌గా అనసూయ, వైస్ చైర్మన్‌గా హరినారాయణ్ బట్టడ్‌ ఎన్నిక

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఆరు మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుచుకుంది. నిజామాబాద్‌ నగర పాలక సంస్థను ఎంఐఎం మద్దతుతో టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది.
1. ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా పండిత్‌ వినీత్‌, వైస్‌ చైర్మన్‌గా మున్నాభాయ్‌ ఎన్నిక.
2. బోధన్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా తూము పద్మ, వైస్‌ చైర్మన్‌గా ఏతేషామ్‌ ఎన్నిక.
3. భీంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా మల్లెల రాజశ్రీ, వైస్‌ చైర్మన్‌గా భగత్‌ ఎన్నిక.
4. కామారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌గా జాహ్నవి, వైస్‌ చైర్మన్‌గా ఇందుప్రియ ఎన్నిక.
5. ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌గా సత్యనారాయణ, వైస్‌ చైర్మన్‌గా సుజాత ఎన్నిక.
6. బాన్సువాడ మున్సిపల్‌ చైర్మన్‌గా జంగం గంగాధర్‌, వైస్‌ చైర్మన్‌గా షేక్‌ జుబేర్‌ ఎన్నిక.

ఉమ్మడి ఖమ్మం జిల్లా: సత్తుపల్లి మునిసిపల్ చైర్మన్‌గా కూసంపూడి మహేష్, వైఎస్ చైర్మన్ తోట సుజలారాణి ఎన్నిక.
1. వైరా మున్సిపల్ చైర్మన్‌గా సూతకాని జైపాల్, వైస్‌చైర్మన్‌గా ముళ్లపాటి సీతారాములు ఎన్నిక.
2. మధిర మున్సిపల్‌ చైర్మన్‌గా మొండితోక లత, యరమల విద్యాలత ఎన్నిక.
3. భద్రాది-కొత్తగూడెం జిల్లా: ఇల్లందు మున్సిపల్‌ చైర్మన్‌గా దమ్మలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్‌గా ఎస్‌డీ జానీ పాషా ఎన్నిక.
4. కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్‌గా కాపు సీతామహాలక్ష్మి, వైస్ చైర్మెన్‌గా వేల్పుల దామోదర్‌ ఏకగ్రీవ ఎన్నిక.

మరిన్ని వార్తలు