మున్సిపాలిటీలు  దేశానికి ఆదర్శం కావాలి

23 Feb, 2020 03:34 IST|Sakshi

అభివృద్ధికి ప్రతినెలా నిధులిస్తాం

ఆర్థిక మంత్రి మంత్రి హరీశ్‌రావు

సాక్షి, సంగారెడ్డి : తెలంగాణలోని మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాలు దేశంలోనే ఆదర్శంగా ఉండాలని దీని కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ‘పట్టణ ప్రగతి సమ్మేళనం’ (అవగాహన, సన్నాహక సమావేశం) నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 24 నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు పట్టణ ప్రగతి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి వార్డులో నాలుగు కమిటీలు ఏర్పాటు చేయాలని, ప్రతి కమిటీలో 60 మంది సభ్యులుండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, మున్సిపల్‌ చైర్మన్లను ఆదేశించారు. ప్రతినెలా మున్సిపాలిటీలకు నిధు లు విడుదల చేస్తామని పేర్కొన్నారు. అభివృద్ధి చేయడమే మీముందున్న సవాలన్నారు.

లంచం లేకుండా పనులు జరగాలి.. 
ఒక్క రూపాయి లంచం లేకుండానే ప్రజలకు పనిచేసి పెట్టాలని హరీశ్‌ సూచించారు. కొత్త మున్సిపల్‌ చట్టం పకడ్బందీగా ఉందని, ప్రజా ప్రతినిధులు, అధికారులు, చివరకు తానైనా పనిచేయకపోతే ఉద్యోగాలు ఊడుతాయని హెచ్చరించారు. పేదలు 75 గజాలలోపు ఇళ్లు కట్టుకుంటే ఎలాంటి అనుమతి, ఫీజు అవస రం లేదన్నారు. చెత్త సేకరణ పద్ధతులు, తది తర అంశాలపై ఎన్‌జీవో ప్రతి నిధి శాంతి, సా హస్‌ సంస్థ ప్రతినిధి మహేశ్‌ తడి–పొడి చెత్త సేకరణ పద్ధతులపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేశారు. కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌లు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా