రెండోవిడతకు నేడే ఆఖరు

13 Jan, 2019 08:56 IST|Sakshi

ఆదిలాబాద్‌అర్బన్‌: రెండోవిడత పంచాయతీ నామినేషన్ల స్వీకరణ సమయం నేటితో ముగియనుంది. ఆదివారం చివరి గడువుకావడంతో ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. మొదటి, రెండురోజులు దాదాపు సరాసరి సంఖ్యలో దాఖలైన నామినేషన్లు మూడోరోజు ఎన్ని నమోదవుతాయో వేచి చూడాలి. కాగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం యథావిధిగా కొనసాగింది.

ఆయానామినేషన్‌ కేంద్రాల్లో రిటర్నింగ్‌ అధికారులు అభ్యర్థుల నుంచి పత్రాలు స్వీకరించారు. నామినేషన్‌ దాఖలు చేసేందుకు కేంద్రాల వద్ద బారులు తీరడంతో స్వీకరణ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటలలోపు కేంద్రంలోకి వెళ్లిన వారు నామినేషన్‌ వేసి బయటకురావాలంటే రాత్రి 7 గంటల వరకు సమయం పట్టింది. తలమడుగు మండలంలోని కుచులాపూర్, సుంకిడి, దేవాపూర్‌ గ్రామంలో అధికారులు రాత్రి వరకు నామినేషన్‌ పత్రాలు స్వీకరించారు.
 
రెండోరోజు.. 
జిల్లాలోని తలమడుగు, బజాహత్నూర్, బోథ్, గుడిహత్నూర్, నేరడిగొండ మండలాల్లోని 149 పంచాయతీలకు, 1208 వార్డులకు రెండోవిడతలో ఈనెల25న ఎన్నికలు జరగనున్నాయి. ఐదు మండలాల్లోని పంచాయతీ సర్పంచ్‌ స్థానాలకు 162 నామినేషన్లు రాగా, వార్డుస్థానాలకు 553 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే రెండోరోజు కూడా అధికంగా బోథ్‌ మండలంలో 33 జీపీలకు 44 నామినేషన్లు రాగా, తక్కువగా నేరడిగొండ, గుడిహత్నూర్‌ మండలాల్లోని జీపీలకు 29 చొప్పున నామినేషన్లు వచ్చాయి. ఇదిలా ఉండగా తొలిరోజు సర్పంచ్‌ స్థానాలకు 147 నామినేషన్లు, వార్డుస్థానాలకు 197 నామినేషన్లు దాఖలైన విష యం తెలిసిందే. కాగా రెండురోజులపాటు జరి గిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలిస్తే.. ఐదు మండలాల్లోని 149 సర్పంచ్‌ పదవులకు 309 నామినేషన్లు రాగా, 1208 వార్డులకు 750 నామినేషన్లు వచ్చాయి.

నేడు తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ
మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించే పంచా యతీలకు ఈనెల7 నుంచి 9 వరకు మూడురో జులపాటు సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేష న్లు స్వీకరించారు. అయితే 10న నామినేషన్లను పరిశీలించిన అధికారులు నాలుగు వార్డు, ఒక సర్పంచ్‌ స్థానానికి వచ్చిన నామినేషన్లను వివిధ కారణాల వల్ల తిరస్కరించిన విషయం తెలిసిం దే. తొలివిడత పంచాయతీ నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల13 ఆఖరు గడువు కావడంతో అధికారులు అన్నీ సిద్ధం చేశారు. ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా నామినేషన్‌ కేంద్రాల్లోనే ఉపసంహరణ ప్రక్రియ జరగనుంది. అనంతరం బరి లో నిలిచే అభ్యర్థులను ప్రకటిస్తారు. తద్వారా ఏకగ్రీవ పంచాయతీ లెక్క తేలనుంది. 

మరిన్ని వార్తలు