సాధారణ పరిశీలకుల నియామకం

2 Jan, 2019 03:28 IST|Sakshi

26 మంది ఐఏఎస్‌లకు బాధ్యతలు

వ్యయ పరిశీలకులుగామరో 39 మంది

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం 26 మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించింది. వీరికి తోడు మరో 39 మంది అధికారులకు వ్యయ పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసిన నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు 26 మంది సాధారణ పరిశీలకులు ఎన్నికల సంఘం వద్ద డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నట్లుగా భావించాలని ఉత్తర్వుల్లో తెలిపారు. వీరి టీఏ, డీఏ ఇతరత్రా ఖర్చులు వారి ప్రస్తుతం పనిచేసే ప్రభుత్వ శాఖ బడ్జెట్‌ పద్దు నుంచి ఖర్చుచేయాలని నిర్దేశించారు. త్వరలో అబ్జర్వర్స్‌తో ఎన్నికల సంఘం సమావేశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

సాధారణ పరిశీలకులు వీరే 
రాష్ట్ర ఎన్నికల సంఘం జనరల్‌ అబ్జర్వర్లుగా నియమించిన వారిలో పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెం కటేశం, గిరిజన సంక్షేమ కార్యదర్శి బెన్హర్‌ మహేష్‌ దత్‌ ఎక్కా, ఉన్నతవిద్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్, సర్వే, భూరికార్డుల కమిషనర్‌ ఎల్‌.శశిధర్, చేతివృత్తుల కార్పొరేషన్‌ ఎండీ శైలజా రామయ్యార్, పరిశ్రమల కమిషనర్‌ అహ్మద్‌ నదీమ్, బీసీ సంక్షేమశాఖ కమిషనర్‌ అనితా రాజేంద్ర, వ్యవసాయశాఖ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జా, క్రీడాపాధికార సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.దినకర్‌బాబు, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ క్రిస్టియాన చౌంగ్తు, గజిటీర్స్‌ కమిషనర్‌ జి.కిషన్, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ కమిషనర్‌ టి.చిరంజీవులు, పాఠశాల విద్య డైరెక్టర్‌ టి.విజయకుమార్, కాలు ష్య నియంత్రణ బోర్డు సభ్యకార్యదర్శి పి.సత్యనారాయణరెడ్డి, చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీసర్‌ (హైదరాబాద్‌) బి.బాలమాయాదేవి, సీసీఎల్‌ఏ డైరెక్టర్‌ వాకాటి కరుణ, ఆయిల్‌ ఫెడ్‌ ఎండీ కె.నిర్మల, మున్సిపల్‌ పాలన శాఖ అదనపు కార్యదర్శి ఎల్‌.శర్మణ్, హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఎం.చంపాలాల్, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంయుక్త కార్యదర్శి బి.భారతి లక్‌పతి నాయక్, మహిళా, శిశుసంక్షేమ శాఖ డైరెక్టర్‌ విజేంద్ర, ఉపాధి–శిక్షణ విభాగం డైరెక్టర్‌ కేవై. నాయ క్, సెర్ఫ్‌ సీఈవో పౌసుమి బాసు, ప్రొటోకాల్‌ సంయుక్త కార్యదర్శి ఎస్‌.అర్విందర్‌ సింగ్, ఎయిడ్స్‌ నియంత్రణ సొసైటీ డైరెక్టర్‌ ప్రీతి మీనా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌ అలగు వర్షిణి ఉన్నారు.

మరిన్ని వార్తలు